‘డ్రాగన్’ సింగిల్ పార్టేనా.. నీల్ సంచలన నిర్ణయం

ABN , Publish Date - Nov 22 , 2026 | 05:23 PM

‘దేవర’ తర్వాత తారక్, ‘సలార్’ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’. ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్‌లో ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు.

Dragon Update

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel)... ఈ ఇద్దరి పేర్లు వినిపిస్తేనే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు మొదలవుతాయి. ‘దేవర’ (Devara) తర్వాత తారక్, ‘సలార్’ (Salaar) తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’ (Dragon). ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్‌లో ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలిసారి వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడం, ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆ అంచనాలను ఆకాశానికి చేర్చడంతో.. ‘డ్రాగన్’ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా మారింది. ఈ సినిమాలో తారక్ లుక్, బాడీ లాంగ్వేజ్ మునుపెన్నడూ చూడని విధంగా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నాయని గ్లింప్స్‌తోనే క్లారిటీ వచ్చేసింది. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అసలు ‘డ్రాగన్’ ఎన్ని భాగాలుగా రాబోతోంది? ప్రశాంత్ నీల్ మైండ్‌లో ఉన్న అసలు ప్లాన్ ఏంటి? ఇప్పుడిదే ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


నిజానికి ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారని, ఒకేసారి రెండు పార్టుల షూటింగ్ పూర్తి చేసి 2027 జూన్ 11న మొదటి భాగాన్ని, ఆ తర్వాత కొద్ది నెలల గ్యాప్‌లోనే రెండో భాగాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో మరో సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ‘డ్రాగన్’ రెండు భాగాలుగా కాకుండా, ఒకే ఒక్క పార్ట్‌గా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ప్రస్తుతం సెట్స్‌పై కేవలం ఒకే భాగానికి సంబంధించిన షూటింగ్ మాత్రమే జరుగుతోందని, దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు ఇప్పటికిప్పుడు పార్ట్-2 చేసే ఆలోచన లేదని టాక్ వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ప్రభాస్ ‘సలార్-2’ అని తెలుస్తోంది. 2027 జూన్ 11న ‘డ్రాగన్’ విడుదలైన వెంటనే, ప్రభాస్‌తో ‘సలార్’ సీక్వెల్ షూటింగ్‌ను పట్టాలెక్కించాల్సి ఉంది. ఒకవేళ ‘డ్రాగన్’ను రెండు భాగాలుగా తీస్తే, ‘సలార్-2’ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అందుకే కథను క్రిస్ప్‌గా ఒకే పార్ట్‌లో పూర్తి చేయాలని నీల్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే, మరో వర్గం మాత్రం... షూటింగ్ మొత్తం పూర్తయ్యాక, ఎడిటింగ్ టేబుల్ వద్ద ఫైనల్ ఫుటేజ్ నిడివిని బట్టి ఒకే పార్ట్‌గా ఉంచాలా లేక రెండు భాగాలుగా విభజించాలా? అనే దానిపై మేకర్స్ తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వస్తే తప్ప పూర్తి క్లారిటీ రాదు.


ఇక ‘డ్రాగన్’ను ప్రశాంత్ నీల్ తన గత చిత్రాల్లా డార్క్, గ్రే షేడ్స్‌లోనే కాకుండా.. ప్రేక్షకులకు ఒక సరికొత్త విజువల్ ట్రీట్ ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నారట. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను అత్యంత కలర్‌ఫుల్‌గా, గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. నీల్ మార్క్ డార్క్ టోన్‌కు పూర్తి భిన్నంగా ఉండే ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, అసలు ఊహకు కూడా అందనంత ట్విస్టులతో, ఎమోషనల్‌గా సాగుతుందని టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘డ్రాగన్’కి నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. నీల్ సినిమాలకు రవి బస్రూర్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్‌లో పూనకాలు తెప్పిస్తుందనే దానికి ‘కెజియఫ్’, ‘సలార్’ చిత్రాలే సాక్ష్యాలు. ‘డ్రాగన్’లో అంతకుమించిన మ్యూజిక్, బీజీఎమ్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో బజ్ వినిపిస్తోంది. మొత్తానికి, ఒకవైపు సింగిల్ పార్టా లేక రెండు పార్టులా అనే సస్పెన్స్.. మరోవైపు నీల్ స్టైల్‌కు భిన్నంగా ఉండబోయే కలర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ వంటి వార్తలతో ‘డ్రాగన్’పై హైప్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. మరి వచ్చే ఏడాది థియేటర్లలోకి రానున్న ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మాస్ విధ్వంసం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

హ్యాట్రిక్ హిట్స్‌తో రెమ్యూనరేషన్ పెంచేసిన సూర్య.. ఎన్ని కోట్లో తెలుసా?

‘నీతో ఓ అడుగు’.. ‘రాయవలస’ ప్రేమ గీతం అదిరింది

Megaverse: పవన్, ప్రభాస్, సూర్య.. లిస్ట్ చూస్తుంటే మతిపోతోందిగా

Updated Date - Nov 22 , 2026 | 05:23 PM

Dragon: అదేంటి అది.. మొన్నే అవుట్ ఫుట్ బాలేదన్నారు.. ఇప్పుడు రెండు పార్ట్స్ అంటారేంటి

Dragon: ఒక్క డైలాగ్‌ రూపు మార్చేసింది.. ఇది ఆరంభం మాత్రమే..

Dragon: ట్రైనర్‌ లుక్.. ఈ పాత్రని గుర్తుపెట్టుకోండి!

Dragon Glimpse: పొరపాటున కూడా నా కల్లోకి రావొద్దు.. అదిరిపోయిన గ్లింప్స్ 

Dragon: డ్రాగన్ లో స్పెషల్ సాంగ్.. హాట్ బ్యూటీని దింపుతున్న నీల్..?