Meenakshi Chaudhary: 60 ఏళ్ల‌ హీరోతో రొమాన్స్‌.. మీనాక్షి వారికే ప్రిఫరెన్స్‌ ఇస్తుందా?

ABN , Publish Date - Aug 04 , 2026 | 06:23 PM

తెలుగులో వరుస సక్సెస్ లతో జోరు మీదున్న మీనాక్షి ఇప్పుడు బాలీవుడ్‌లోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

Meenakshi Chaudhary

2021లో ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ప్రామిసింగ్ హీరోయిన్‌గా తనదైన ముద్ర వేసుకుంది. కేవలం అందంతోనే కాకుండా, వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ముఖ్యంగా వరుసగా మూడు సంక్రాంతి సీజన్లలో మూడు బ్లాక్‌బస్టర్ హిట్లు సాధించి గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకుంది. హిట్-2, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకుంటూ తన సక్సెస్ గ్రాఫ్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో నాగచైతన్య సరసన వృషకర్మ అనే భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తూ టాప్ హీరోయిన్ల జాబితాలో నిలిచింది.

తెలుగులో వరుస సక్సెస్ లతో జోరు మీదున్న ఈ భామ, ఇప్పుడు బాలీవుడ్‌లోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. హిందీలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన హీరోయిన్‌గా నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రకటన రాగానే సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ మొదలైంది. అక్షయ్ కుమార్ వయస్సు 58 సంవత్సరాలు కాగా, మీనాక్షి చౌదరి వయస్సు 29 ఏళ్లు. వీరిద్దరి మధ్య దాదాపు 29 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉండటంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Meenakshi Chaudhary

మీనాక్షి కేవలం సీనియర్ హీరోలకే పరిమితమవుతుందా అనే సందేహాలను కొందరు లేవనెత్తుతున్నారు. ఈ ఏజ్ గ్యాప్ కామెంట్స్‌పై సినీ విశ్లేషకులు భిన్నంగా స్పందిస్తున్నారు. గతంలో మీనాక్షి తెలుగులో రవితేజ, వెంకటేష్ వంటి సీనియర్ స్టార్లతో కలిసి నటించి సూపర్ హిట్లు అందుకుంది. అప్పుడు రాని అభ్యంతరం, ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ సమయంలో మాత్రమే ఎందుకు వస్తోందనేది కొందరి ప్రశ్న.

సినిమా పరిశ్రమలో సీనియర్ హీరోలతో యంగ్ హీరోయిన్లు జతకట్టడం దశాబ్దాలుగా జరుగుతున్నదే. గతంలోనూ ఎంతోమంది స్టార్ హీరోయిన్లు తమ కెరీర్ ప్రారంభంలో ఏజ్ గ్యాప్ ఉన్న హీరోలతో కలిసి పనిచేసి బిగ్గెస్ట్ హిట్లు అందించారు. కథకు ఏ పాత్ర సరిపోతుంది, వెండితెరపై ఆ జోడీ కెమిస్ట్రీ ఎలా వర్కవుట్ అవుతుందనేదే ఇక్కడ ముఖ్యం తప్ప వయస్సు కాదనేది విశ్లేషకుల అభిప్రాయం. సోషల్ మీడియా యుగంలో చిన్న విషయానికే ట్రోలింగ్ రావడం కామన్ అయిపోయింది.

Meenakshi Chaudhary

అయితే ఎంతోమంది నటీమణులు ఇలాంటి కామెంట్లను తమ నటనతో, బాక్సాఫీస్ రికార్డులతో తిప్పికొట్టారు. మీనాక్షి కూడా అదే బాటలో పయనిస్తోంది. వరుస విజయాలతో తన స్టామినా ఏంటో నిరూపించుకుంటూ, తోటి హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. చిత్రసీమలో సక్సెస్ మాత్రమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. టాలీవుడ్‌లో తిరుగులేని ట్రాక్ రికార్డును సొంతం చేసుకున్న మీనాక్షి, బాలీవుడ్‌లో కూడా అదే స్థాయి విజయాన్ని సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Updated Date - Aug 04 , 2026 | 07:06 PM