Meenakshi Chaudhary: నాపై.. రోజుకోటి పుట్టిస్తున్నారు! డ్యామేజ్ చేస్తున్నారు
ABN , Publish Date - Dec 10 , 2025 | 04:23 PM
తన గురించి సోషల్ మీడియాలో రోజుకో పుకారు పుట్టిస్తున్నారని హీరోయిన్ మీనాక్షి చౌదరి వాపోతోంది.
తన గురించి సోషల్ మీడియాలో రోజుకో పుకారు పుట్టిస్తున్నారని హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) వాపోతుంది. తెలుగులో లక్కీభాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం, గుంటూరు కారం, తమిళంలో ‘కొలై’, ‘సింగపూర్ సలూన్’, ‘ది గోట్’ వంటి చిత్రాల్లో నటించిన తమిళ ప్రేక్షకులకు దగ్గరైన ఈ నటి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్స్‌ను సపాదించుకుంది. వరుస చిత్రాలతో టాప్ పోజిషన్‌కు చేరి తమిళ, తెలుగు భాషల్లో బిజీ హీరోయిన్ అయిపోయారు.

అయితే.. అదేసమయంలో ఆమెపై సోషల్ మీడియాలో రోజుకో పుకారు వస్తోంది. కొంత కాలంగా మీనాక్షి తొలి సినిమా హీరో సుశాంత్‌తో ప్రేమలో ఉందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు బాగా వచ్చాయి.
అంతేగాక ఆపై మరోకరి ఇద్దరు ముగ్గురు హీరోలతోనూ కలిపి ఇలాంటి వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో..ఈ వార్తలపై ఆమె తాజాగా స్పందించారు.

‘సోషల్ మీడియాలో నెటిజన్లు, యూట్యూబర్స్, వెబ్‌సైట్స్ నిర్వాహకులు సెన్సేషన్ న్యూస్ కోసం ఈ తరహా పుకార్లు పుట్టిస్తూ, నా పేరు డ్యామేజ్ చేస్తున్నారు. ఇలాంటి వారికి ఇంతకుమించిన పని మరొకటి లేదు. నాకు ఏ ఒక్క హీరోతో ఎలాంటి ప్రేమ, రిలేషన్ లేదు’ అని ఆమె స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే ఈ ముద్దుగుమ్మ నటించిన అనగనగా ఒ క రాజు సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాట మంచి బజ్ తీసుకువచ్చింది.
