Meenakshi Chaudhary: కుర్ర హీరోలనే కాదు సీనియర్ హీరోలను కూడా వదలడం లేదుగా
ABN , Publish Date - Nov 03 , 2025 | 08:47 PM
ఒకప్పుడు సీనియర్ హీరోలతో రొమాన్స్ చేయాలంటే కుర్ర హీరోయిన్లు ఆలోచించేవారు. ఎందుకు అంటే.. ఆ తరువాత నుంచి కూడా సీనియర్ హీరోలతోనే ఛాన్స్ వస్తాయేమో అని.. కానీ, ఇప్పుడు కుర్ర హీరోయిన్లు వయస్సుతో సంబంధం లేదు అని చెప్పుకొచ్చేస్తున్నారు.
Meenakshi Chaudhary: ఒకప్పుడు సీనియర్ హీరోలతో రొమాన్స్ చేయాలంటే కుర్ర హీరోయిన్లు ఆలోచించేవారు. ఎందుకు అంటే.. ఆ తరువాత నుంచి కూడా సీనియర్ హీరోలతోనే ఛాన్స్ వస్తాయేమో అని.. కానీ, ఇప్పుడు కుర్ర హీరోయిన్లు వయస్సుతో సంబంధం లేదు అని చెప్పుకొచ్చేస్తున్నారు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా పట్టించుకోకుండా ముందుకు దూసుకెళ్తున్నారు. తాజాగా టాలీవుడ్ లో కుర్ర హీరోలతోనే కాదు సీనియర్ హీరోలతో కూడా జతకట్టి శభాష్ అనిపించినుకుంటుంది మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary).
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ తో రొమాన్స్ చేసిన ఈ భామ ఆ తరువాత కుర్ర హీరోలతో కూడా జతకట్టింది. ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య సరసన NC24 లో నటిస్తున్న మీనాక్షీ.. మరో సీనియర్ హీరో సరసన ఛాన్స్ పట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ సీనియర్ హీరో విక్రమ్ చాలా గ్యాప్ తరువాత ఒక సినిమాను ప్రకటించాడు. అదే చియాన్ 63. బోడి రాజ్ కుమార్ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ఈ మధ్యనే విక్రమ్ తన 63 వ సినిమాను అధికారికంగా ప్రకటించాడు.
ఇక ఈ చిత్రంలో విక్రమ్ సరసనా మొదట ప్రియాంక మోహన్ నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ, ఇప్పుడు మీనాక్షీ చౌదరిని ఫైనల్ చేశారని టాక్ నడుస్తోంది. మీనాక్షీకి ఇది మంచి అవకాశం. కోలీవుడ్ లోవిజయ్ సరసన గోట్ సినిమాతో అడుగుపెట్టింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు విక్రమ్ తో జతకట్టే ఛాన్స్ ను అమ్మడు పట్టేసింది. మరి ఈ సినిమాతోనైనా కోలీవుడ్ లో పాగా వేస్తుందేమో చూడాలి.