‘వృషకర్మ’ రిలీజ్ పై డౌట్స్ వద్దు.. ఇదిగో క్లారిటీ
ABN , Publish Date - Nov 22 , 2026 | 08:03 PM
యువ సామ్రాట్ నాగ చైతన్య ఇంతకుముందెన్నడూ చూడని విభిన్నమైన, సాహసోపేతమైన పాత్రలో నటిస్తోన్న భారీ మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ఈ మూవీ రిలీజ్‌పై వస్తున్న రూమర్స్‌కు మేకర్స్ బ్రేక్ వేశారు.
యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya) ఇంతకుముందెన్నడూ చూడని విభిన్నమైన, సాహసోపేతమైన పాత్రలో నటిస్తోన్న భారీ మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ (Vrushakarma). ‘విరూపాక్ష’ వంటి సంచలన విజయం తర్వాత దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై మొదటి నుంచీ ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొన్నాయి. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందంటూ.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ వాయిదా రూమర్లన్నింటికీ చిత్ర బృందం ఒక్క పోస్టర్‌తో పూర్తిస్థాయిలో చెక్ పెట్టింది. ముందుగా ప్రకటించినట్లుగానే 4 డిసెంబర్, 2026న ‘వృషకర్మ’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు.
సినిమా ఫైనల్ ఎడిట్ కూడా పూర్తవడంతో చిత్ర బృందం ప్రమోషన్ల జోరును పెంచింది. ఇందులో భాగంగా నవంబర్ 25వ తేదీన ‘వృషకర్మ’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నెల్లూరులోని ‘SV కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్’ వేదికగా జరగనున్న భారీ ఈవెంట్లో ఈ ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ట్రైలర్ అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల చేసిన సరికొత్త పోస్టర్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఈ పోస్టర్లో నాగ చైతన్య భుజంపై తాడు వేసుకుని, ఒక చేతిని ముందుకు చాపుతూ అత్యంత ఇంటెన్స్, డిటర్మైండ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయనకు ఒకవైపు కళ్లద్దాలు, ఒత్తైన గడ్డంతో సీనియర్ నటుడు జయరామ్ కనిపిస్తుండగా.. మరోవైపు కళ్లద్దాలు ధరించిన హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతిలో మండుతున్న జ్వాల పట్టుకుని మిస్టీరియస్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు.
డార్క్, ఎర్తీ టోన్స్‌తో పాటు ఫైరీ రెడ్ స్మోక్, పురాతన కాలాన్ని గుర్తుచేసే వృత్తాకార చిహ్నాలతో రూపొందించిన ఈ పోస్టర్ సినిమాలోని రహస్య ప్రపంచంపై భారీ క్యూరియాసిటీని పెంచుతోంది. ఇటీవల నాగ చైతన్య, అలాగే మీనాక్షి చౌదరి నటించిన గత చిత్రాలు వంద కోట్ల మార్కును అందుకోవడంతో, ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్‌పై భారీ క్రేజ్ ఏర్పడింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా నటిస్తుండగా, కియారా ఖన్నా, సత్య ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రఘుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ, బి. అజనీష్ లోకనాథ్ సంగీతం, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్, నవీన్ నూలి ఎడిటింగ్ అందిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌తో సినిమాపై మరింతగా అంచనాలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
ఆదర్శ కుటుంబం.. ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేది ఎప్పుడు?
‘డ్రాగన్’ సింగిల్ పార్టేనా.. నీల్ సంచలన నిర్ణయం
హ్యాట్రిక్ హిట్స్‌తో రెమ్యూనరేషన్ పెంచేసిన సూర్య.. ఎన్ని కోట్లో తెలుసా?