స్టార్ కాదు.. ‘డేవిడ్ రెడ్డి’ టీజర్ అప్డేట్‌తో వచ్చిన ‘రా కింగ్’!
ABN, Publish Date - May 17 , 2026 | 09:26 PM
ఇప్పటి వరకు మంచు మనోజ్‌కు ముందు ఉన్న ట్యాగ్ ‘రాకింగ్ స్టార్’. కానీ, ఈ బర్త్‌డే నుంచి ఆయన తన ట్యాగ్‌ను మార్చుకున్నారు. ఆ న్యూ ట్యాగ్‌తో పాటు, ఆయన చేస్తున్న ‘డేవిడ్ రెడ్డి’ అప్డేట్‌తో వచ్చారు మంచు మనోజ్.
ఇప్పటి వరకు మంచు మనోజ్ (Manchu Manoj)కు ముందు ఉన్న ట్యాగ్ ‘రాకింగ్ స్టార్’. కానీ, ఈ బర్త్‌డే నుంచి ఆయన తన ట్యాగ్‌ను మార్చుకున్నారు. ఇకపై తనని ‘రా కింగ్’ (RawKing)గా పిలిచేలా.. తన పేరుకు ముందు ట్యాగ్‌ని ఆయనే జత చేసుకున్నారు. తన బర్త్‌డే (మే 20) స్పెషల్‌గా ‘ఐక్య ధైర్య సేన సమితి’ (Aikya Dhairya Sena Samithi) అనే పేరుతో సేవా సంస్థను ప్రారంభించిన మంచు మనోజ్.. ఈ సంస్థను రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఆయన నటిస్తోన్న ‘డేవిడ్ రెడ్డి’ (David Reddy) మూవీ నుంచి బర్త్‌డే స్పెషల్‌గా టీజర్ వదలబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో.. మనోజ్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. డైరెక్టర్ హనుమా రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్‌తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో.. భారీ పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఆదివారం మేకర్స్ ఈ క్రేజీ అప్డేట్‌ను వదిలారు. ఇప్పటికే వచ్చిన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో తెలియంది కాదు. ఇప్పుడు రాబోతున్న టీజర్‌పై కూడా భారీ అంచనాలున్నాయి.
బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచిన ఒక యోధుడి తిరుగుబాటు కథగా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో మంచు మనోజ్ కొత్త అవతార్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా, హీరోగా మనోజ్‌కు మంచి కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందనేలా ఇప్పటికే ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. 1897 నుంచి 1920 మధ్య బ్రిటీష్ పాలనా కాలాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు ఈ కథను రూపొందించారు. మరియా ర్యాబోషాప్కా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో రమ్య కృష్ణ, సముద్రఖని, అభయ్ డియోల్, కాంచన వంటి వారంతా ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Mega158: మాస్ వర్కవుట్స్‌తో మెగా158 అప్డేట్.. చిరు వీడియో వైరల్!
లేటు వయసులో ఖరీదైన 'పోర్షే' లగ్జరీ కారు.. సీనియర్ నరేశ్ జల్సానే జల్సా! ఖరీదెంతో తెలుసా?
Chiranjeevi: ‘పెద్ది’ ట్రైలర్ చూశా.. ఒక్కొక్కరు రఫ్ఫాడించేశారు!
Keneeshaa: 4 నెలల బిడ్డను కోల్పోయిన నేను.. జయం రవి జీవితం నాశనం చేస్తానా?