Manchu Manoj: ఏ జన్మ పుణ్యమో నాది.. పెళ్లి తర్వాత మంచు మనోజ్ ఎవరి గురించి ఈ మాటన్నాడంటే..

ABN , First Publish Date - 2023-03-04T16:10:30+05:30 IST

మంచు మనోజ్‌-మౌనికా రెడ్డి (Manchu Manoj and Mounika Reddy)ల వివాహం శుక్రవారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మంచు లక్ష్మీ (Manchu Lakshmi) నివాసంలో అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో

Manchu Manoj: ఏ జన్మ పుణ్యమో నాది.. పెళ్లి తర్వాత మంచు మనోజ్ ఎవరి గురించి ఈ మాటన్నాడంటే..
Manchu Manoj and Mounika Reddy Marriage

మంచు మనోజ్‌-మౌనికా రెడ్డి (Manchu Manoj and Mounika Reddy)ల వివాహం శుక్రవారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మంచు లక్ష్మీ (Manchu Lakshmi) నివాసంలో అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో.. అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

manchumanojmarriage3.jpg

ఈ పెళ్లికి (Manchu Manoj Weds Mounika Reddy) సంబంధించిన ఫొటోలు కూడా అధికారికంగా విడుదల చేశారు. ఈ ఫొటోలలో మంచు ఫ్యామిలీతో (Manchu Family) పాటు.. భూమా ఫ్యామిలీ (Bhuma Family) కూడా సంతోషంగా నూతన దంపతులను ఆశీర్వదిస్తున్నారు. అయితే ఈ పెళ్లికి సంబంధించి.. తాజాగా మంచు మనోజ్ (Manchu Manoj) ఓ ఆసక్తికర పోస్ట్ ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేశారు.

manchumanojmarriage6.jpg

ఆయన పోస్ట్ చూస్తుంటే ఈ పెళ్లి జరగడానికి మంచు మోహన్ బాబో (Manch Mohan Babu), మంచు విష్ణు (Manchu Vishnu)నో కారణం కానే కాదని తెలుస్తుంది. వాస్తవానికి ఈ పెళ్లి మోహన్ బాబుకి ఇష్టంలేదని మొదటి నుంచి వార్తలు వినపిస్తూనే ఉన్నాయి. తాజాగా మంచు మనోజ్ పోస్ట్‌తో అది మరోసారి స్పష్టమైంది. ఈ పెళ్లికి దగ్గరుండి అన్నీ చూసుకున్న వ్యక్తి ఎవరో.. ఆ వ్యక్తికి ఈ పోస్ట్‌లో మనోజ్ థ్యాంక్స్ చెప్పారు. ఆ వ్యక్తి ఎవరో కాదు. మనోజ్ సోదరి మంచు లక్ష్మీ.

Manoj.jpg

‘‘అక్కా.. ఏ జన్మ పున్మమో నాది. లవ్ యు అక్కా అండ్ థ్యాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్’’ అంటూ మంచు మనోజ్ ఓ భావోద్వేగభరిత పోస్ట్‌ను ఇన్‌స్టా (Manchu Manoj Insta Post) వేదికగా షేర్ చేశారు. ఈ పోస్ట్‌తో మంచు మనోజ్ రెండో పెళ్లి (Second Marriage)కి సంబంధించి కర్త, కర్మ, క్రియ అన్నీ మంచు లక్ష్మీనే అని తెలుస్తోంది. ఈ పెళ్లికి మంచు లక్ష్మి అన్నీ తానై దగ్గరుండి చూసుకున్నందు వల్లే.. అక్కపై మనోజ్ తన ప్రేమను, కృతజ్ఞతను చాటుకున్నాడు. అయితే.. మంచు ఫ్యామిలీకి సంబంధించి ఇంకెవరి పేరు ఇక్కడ మనోజ్ ప్రస్తావించక పోవడం కూడా.. ఈ పెళ్లి విషయంలో మంచు లక్ష్మీ ఎంతగా ప్రయత్నాలు చేసిందనేది అర్థమవుతోంది.

manchumanojmarriage7.jpg

గతంలో పలు మార్లు ఆమె విష్ణుతో కన్నా.. మనోజ్‌తోనే చాలా ఫ్రీగా ఉంటానని, ఇద్దరం అక్కాతమ్ముళ్ల కంటే కూడా బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఎక్కువగా ఉంటామని చెప్పుకొచ్చింది. అందుకే ఇప్పుడు మనోజ్ పెళ్లికి పెద్దగా మారి.. అన్నీ అడ్డంకులను దాటి.. అతనిని ఓ ఇంటివాడిని చేసిందని అంతా అనుకుంటున్న క్రమంలో.. స్వయంగా మనోజే ఈ పోస్ట్ ద్వారా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Amigos: ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు, ఎక్కడంటే?

* Waltair Veerayya: చిరంజీవి పేరు మీదే మరో రికార్డ్

* Veera Simha Reddy: 50 రోజులు.. ఎన్ని సెంటర్లలోనో తెలుసా?

* Sir: రియల్ ‘సార్’కు ‘సార్’ టీమ్ సహకారం

* Virupaksha Teaser: ప్ర‌మాదాన్ని దాట‌డానికే ఈ ప్రయాణం.. ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్లుందే!

* Allu Arjun: ఇక్కడా తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ ఖాతాలో మరో రికార్డ్

* Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్

* Mega Power Star Ram Charan: నా జీవితంలో అద్భుత‌మైన క్ష‌ణాలివి

* Actress: అరుదైన వ్యాధి బారిన మరో నటి.. బాబోయ్ పగవారికి కూడా ఈ వ్యాధి రాకూడదు

* KTR: ‘బలగం’.. కేటీఆర్ కంటి సైగతో యాంకర్ ఏం చేసిందో చూశారా..

Updated Date - 2023-03-04T21:42:49+05:30 IST