సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Makutam Teaser: మాటల్లేవ్.. ఆ ఫస్ట్ షాట్ ఒక్కటి చాలు!

ABN, Publish Date - Jun 11 , 2026 | 08:07 PM

ఎప్పుడూ రొటీన్ చిత్రాలు కాకుండా.. విలక్షణమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించే హీరో విశాల్. ‘మార్క్ ఆంటోనీ’, ‘మద గజ రాజా’ చిత్రాలతో మంచి విజయాల్ని అందుకున్న విశాల్.. ఇప్పుడు ‘మకుటం’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Makutam Movie Still

ఎప్పుడూ రొటీన్ చిత్రాలు కాకుండా.. విలక్షణమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించే హీరో విశాల్ (Vishal). ‘మార్క్ ఆంటోనీ’, ‘మద గజ రాజా’ చిత్రాలతో మంచి విజయాల్ని అందుకున్న విశాల్.. ఇప్పుడు ‘మకుటం’ (Makutam) అనే ఓ స్పెషల్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హీరోగా, దర్శకుడిగా విశాల్ చేసిన తొలి ప్రాజెక్ట్ ఇది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమాగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి నిర్మాత ఆర్.బి. చౌదరి. రవి అరసు అందించిన కథ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. గురువారం (జూన్ 11) మేకర్స్ చిత్ర టీజర్‌ (Makutam Teaser)ను విడుదల చేశారు.


ఈ టీజర్‌లో ఫస్ట్ షాట్‌కి గూస్‌బంప్స్ రావడం పక్కా. మండుతున్న శవం నుంచి సిగరెట్ వెలిగించుకుంటూ విశాల్ ఇచ్చిన ఎంట్రీకి వావ్ అనాల్సిందే. ఇంకా ఇందులో అంజలి మాస్ యాక్షన్‌ను చూపించారు. అంజలి ఓ కొత్త అవతారంలో కనిపించడమే కాకుండా.. విరోచితంగా పోరాడుతోంది. విశాల్ మూడు డిఫరెంట్ గెటప్స్‌లో తన విశ్వరూపం ప్రదర్శించారు. ఈ టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, బీజీఎం అన్నీ కూడా అద్భుతంగా కుదిరాయి. మరో విశేషం ఏమిటంటే.. టీజర్ చివరిలో వచ్చే ‘కడలిని శ్వాసించే వారు వేరు.. ఆ కడలినే శాసించే వాడు వేరు’ అనే డైలాగ్ మినహా.. ఒక్క మాట కూడా లేదు. అంతా యాక్షన్‌తో నింపేశారు. టీజర్ చూస్తుంటే.. ఇదొక యాక్షన్ ప్యాక్డ్ మూవీ అనేది అర్థమవుతోంది.


హీరోగా, దర్శకుడిగా విశాల్ అద్భుతమైన పనితీరుని కనబర్చారని టీజర్ స్పష్టం చేస్తోంది. విశాల్ త్రిపాత్రాభినయం, స్టైలిష్ దర్శకత్వం, ఆసక్తికరమైన కథనం, అద్భుతమైన సాంకేతిక పనితనం.. అన్నీ కలిసి ఈ చిత్రాన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లలో నిలబెట్టేశాయని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. జూలైలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష: చిరంజీవి కుమార్తె శ్రీజ

బాక్సాఫీస్‌పై ‘పెద్ది’ వేట.. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?

నిన్న అల్లు అర్జున్.. నేడు అఖిల్.. చరణ్ యాక్టింగ్‌కు ఫిదా!

Updated Date - Jun 11 , 2026 | 08:07 PM