Vishal 35: సూపర్ గుడ్ ఫిలిమ్స్ నుండి 99వ చిత్రం...
ABN , Publish Date - Jul 14 , 2025 | 02:48 PM
సంక్రాంతికి విడుదలైన మదగజరాజాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు విశాల్. అతను హీరోగా తాజాగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి. చౌదరి కొత్త చిత్రాన్ని ప్రారంభించారు.
ప్రముఖ కథానాయకుడు విశాల్ (Vishal) హీరోగా 35వ చిత్రం మొదలైంది. దీనిని సీనియర్ నిర్మాత ఆర్.బి. చౌదరి (RB choudhary) తన సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో నిర్మిస్తుండటం విశేషం. 1990లో 'పుదు వసంతం' (Pudhu Vasantham) తో సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ మొదలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఆర్. బి. చౌదరి 98 చిత్రాలు నిర్మించారు. ఆయన బ్యానర్ నుండి వస్తున్న 99వ చిత్రం ఇది.
విశాల్ హీరోగా ఆర్.బి. చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమంలో జులై 14 ఉదయం అట్టహాసంగా చెన్నయ్ లో జరిగాయి. దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaaran), శరవణ సుబ్బయ్య, మణిమారన్, వెంకట్ మోహన్, శరవణన్ దీనికి హాజరయ్యారు. అలానే హీరోలు కార్తీ (Karthi), జీవా (Jiiva) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమాకు రవి అరసు (Ravi Arasu) దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్, రవి అరసు కాంబోలో వస్తున్న తొలి చిత్రం ఇది. ఈ సినిమాలో దుషార విజయన్ (Dushara Vijayan) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన 'మదగజరాజా'కు రిచర్డ్ ఎం. నాధన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యహరించారు. ఆయనే ఈ సినిమాకూ వర్క్ చేస్తున్నారు. అలానే విశాల్ 'మార్క్ ఆంటోనీ'కి సంగీతం అందించిన జి.వి. ప్రకాశ్ కుమార్ ఈ తాజా చిత్రానికి స్వరాలు సమకూర్చుతున్నారు. తంబి రామయ్య, అర్జై ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ చెన్నయ్ లోనే జరుగునుంది. సింగిల్ షెడ్యూల్ లో 45 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.
Also Read: Saroja Devi: తెలుగుపలుకులు చిలుక పలుకుల్లా
Also Read: Tollywood: లిక్కర్ స్కామ్‌లో.. వెలుగులోకి సంచలన విషయాలు