Vishal - Dhansika: పెళ్లి ఆలస్యం ఎందుకంటే.. ధన్సిక కూడా సై అంది

ABN , Publish Date - Aug 30 , 2025 | 12:12 PM

హీరో విశాల్‌ (Vishal) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. తన బ్యాచ్‌లర్‌ లైప్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారు. నటి సాయి ధన్సికతో (Sai Dhansika) ఇటీవల ఆయన నిశ్చితార్థ వేడుక జరిగింది. కల్యాణ వేదిక ఫిక్స్ అయింది 

Vishal - Sai Dhansika


హీరో విశాల్‌ (Vishal) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. తన బ్యాచ్‌లర్‌ లైప్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారు. నటి సాయి ధన్సికతో (Sai Dhansika) ఇటీవల ఆయన నిశ్చితార్థ వేడుక జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పెళ్లి వాయిదా పడటానికి కారణాన్ని చెప్పారు. ‘నడిగర్‌ సంఘం’ (Nadigar Sangam) భవన నిర్మాణం కోసం తొమ్మిదేళ్లు పెళ్లిని పోస్ట్‌పోన్‌ చేసినట్లు చెప్పారు.  

‘బ్యాచ్‌లర్‌గా ఇది నా చివరి పుట్టినరోజు ఇది.. ‘నడిగర్‌ సంఘం’ బిల్డింగ్‌ పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఇప్పటికీ ఈ విషయం ఎన్నోసార్లు చెప్పాను. ఈ షరతుకు ధన్సిక కూడా అంగీకరించింది. అందుకే 9 ఏళ్లుగా వేచి చూశాం. మరో 2 నెలల్లో అది పూర్తిగా సిద్థమవుతుంది. మా పెళ్లి అందులోనే జరగనుంది. దీని కోసం ఇప్పటికే ఇందులో ఆడిటోరియం కూడా బుక్‌ చేసుకున్నాం. మొదట చేసిన ప్లాన్‌ అయితే ఆగస్టు 29న పెళ్లి జరగాల్సి ఉంది. చిన్న మార్పు జరిగింది. ఈ భవనం ప్రారంభోత్సవం జరిగిన వెంటనే మా వివాహ తేదీ నిర్ణయిస్తాం. ఇందులో జరిగే మొదటి పెళ్లి మాదే’ అని అన్నారు. తన పుట్టినరోజు నాడే నిశ్చితార్థం జరగడం ఎంతో ఆనందంగా ఉందని విశాల్‌ పోస్ట్‌ పెట్టారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు తెలిపారు. అందరి ఆశీస్సులు కావాలని కోరుతూ ఫొటోలు షేర్‌ చేశారు.  

ALSO READ: Allu kanakaratnam: అల్లు అరవింద్‌కు మాతృ వియోగం

 Kenisha: రవి మోహన్‌ ప్రతిభ ప్రపంచానికి తెలియాలి

Joy Crizildaa: గర్భిణిని చేసి మోసం చేశాడు..

Updated Date - Aug 30 , 2025 | 12:25 PM