Makutam: విశాల్ కొత్త మూవీ.. టైటిల్ భలే ఉందే

ABN , Publish Date - Aug 24 , 2025 | 03:27 PM

కోలీవుడ్ హీరో విశాల్ (Vishal) ఈ మధ్యకాలంలో బాగా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యిన విషయం తెల్సిందే.

Vishal

Makutam: కోలీవుడ్ హీరో విశాల్ (Vishal) ఈ మధ్యకాలంలో బాగా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యిన విషయం తెల్సిందే. ఒక ఈవెంట్ లో కళ్ళు తిరిగి పడిపోవడం, ఆ తరువాత అతని ఆరోగ్యంపై రకరకాల పుకార్లు రావడం జరిగాయి. విశాల్ కు ఏమైంది అని కంగారుపడుతున్న ఫ్యాన్స్ కు తాను బాగానే ఉన్నాను అని చెప్పడంతో పాటు హీరోయిన్ సాయి ధన్సికతో ప్రేమలో ఉన్నానని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చాడు. దీంతో ఇప్పటికైనా విశాల్ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చూపించాడని నెటిజన్స్ ఆనందం వ్యక్తం చేశారు.


ఇక విశాల్ మార్క్ ఆంటోనీ సినిమా తరువాత రత్నం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇక ఈ ఏడాది విశాల్ నటించిన పాత సినిమా మదగజరాజ రీరిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్ తో విశాల్ కొత్త సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. రవి అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూలైలోనే పట్టాలెక్కింది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ నుంచి వస్తున్న 99 వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.


ఇక తాజాగా విశాల్ 35 వ సినిమా టైటిల్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మకుటం అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ టైటిల్ టీజర్ లో ఒక పీత.. సముద్రంలో నుంచి ఒక షిప్ లోకి వచ్చి.. అక్కడున్న జనాలను దాటుకొని విశాల్ వద్దకు వస్తున్నట్లు చూపించారు. విశాల్ ముఖం చూపించకుండా జాగ్రత్త పడ్డారు. టీజర్ ను బట్టి చూస్తుంటే ఇదొక సముద్ర కింగ్ కథగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విశాల్ సరసన దుషారా విజయన్ నటిస్తుండగా.. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో విశాల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

The Trial: ఓటీటీకి వ‌చ్చేస్తోన్న కాజోల్ కోర్టు రూం డ్రామా

EK DEEWANE KI DEEWANIYAT: తెలుగు కుర్రాడి.. బాలీవుడ్ మూవీ ట్రైల‌ర్ వ‌చ్చేసింది.

Updated Date - Aug 24 , 2025 | 03:27 PM