మహేశ్ బాబుకు డై-హార్డ్ ఫ్యాన్ అంటే ఈ చిన్నారే..
ABN, Publish Date - Nov 25 , 2026 | 12:46 PM
సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు పేరు చెబితేనే క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. తాజాగా ఆయన పెట్టిన ఒక్క కామెంట్, ఒక చిన్నారి ఇన్స్టాగ్రామ్ రీల్‌ను ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మార్చేసింది.
సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu) పేరు చెబితేనే క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. తాజాగా ఆయన పెట్టిన ఒక్క కామెంట్, ఒక చిన్నారి ఇన్స్టాగ్రామ్ రీల్‌ను ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మార్చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘bysweetlycurious’ అనే అకౌంట్ నుంచి పోస్ట్ చేసిన ఓ పాప క్యూట్ వీడియోకు మహేశ్ బాబు ఫిదా అయ్యారు. మహేశ్ బాబు స్పందనతో ఆ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోవడమే కాకుండా, ఆ అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 35 వేల నుంచి 1.73 లక్షలకు చేరుకోవడం విశేషం.
అసలు ఆ వీడియోలో ఏముందంటే.. నాన్న చెప్పులు తొడుగుతుంటే, ఆ చిన్నారి తన ముద్దుముద్దు మాటలతో “నొప్పి నొప్పి గుండెంత నొప్పి..” అంటూ మహేశ్ బాబు బ్లాక్‌బస్టర్ చిత్రం ‘పోకిరి’లోని పాటను పాడుతూ అదరగొట్టింది. అంతటితో ఆగకుండా, తల్లి వంట చేస్తుండగా ‘గుంటూరు కారం’లోని ‘దమ్ మసాలా’ సాంగ్‌ను కూడా ఎంతో ఉత్సాహంగా పాడింది. కూతురి అల్లరి, పాటల జోరు చూసిన తల్లి.. ‘వీడియో చూసేవాళ్లు నిన్ను ఎలా పెంచుతున్నాం అనుకుంటారే’ అంటూ సరదాగా కౌంటర్ వేసింది. చిన్న వయసులోనే మహేశ్ బాబు పాటలపై ఆ పాపకున్న క్రేజ్ చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు.
ఈ క్యూట్ రీల్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కంట పడటంతో ఆయన తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ (urstrulymahesh) నుంచి స్పందించారు. ‘‘Haha... so cute.. Lots of love to the little one’’ అంటూ లవ్ ఎమోజీలనులతో కామెంట్ పెట్టారు. మహేశ్ కామెంట్ చేయగానే ఆ రీల్ వైరల్‌గా మారిపోయింది. ఫ్యాన్స్ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. తాజాగా దీనిపై ఆ చిన్నారి తల్లి స్పందిస్తూ.. ‘‘బాబు రిప్లై ఇవ్వకముందు ఇది కేవలం ఒక ట్రయల్ రీల్ మాత్రమే. మా వల్ల మీరందరూ నవ్వుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఆనందం వ్యక్తం చేశారు. ‘మహేశ్ బాబుకు అసలైన డై-హార్డ్ ఫ్యాన్ అంటే ఈ చిన్నారే’.. అంటూ అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. అలాగే మా వీడియోలకు కూడా రియాక్ట్ కావచ్చుగా అన్నా.. అంటూ ఫ్యాన్స్ కోరుకుంటూ ఉండటం విశేషం. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు ‘వారణాసి’ అనే చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి:
‘భోగి’ ప్రమోషన్స్.. డింపుల్ కోసమే అనుపమని పక్కన పెట్టారా?
ధర్మేంద్ర మొదటి వర్ధంతి.. హేమమాలిని ఎమోషనల్ పోస్ట్
‘ఐ హేట్ మ్యారేజ్’ కేవలం బోల్డ్ సినిమా కాదు.. దర్శకుడు ఏం చెప్పారంటే