Mahesh Babu All Time Record: సూపర్ స్టార్ 'బిజినెస్ మేన్' అల్ టైం రికార్డు

ABN , First Publish Date - 2023-08-10T16:19:46+05:30 IST

మహేష్ బాబు తన ప్రభంజనాన్ని మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించాడు. అదేదో అతని కొత్త సినిమా విడుదలై రికార్డుల పంట పండించటం కాదు, అతని పాత సినిమా 'బిజినెస్ మేన్' మళ్ళీ విడుదలై మొదటి రోజు రికార్డు కలెక్షన్స్ సృష్టించి అల్ టైం రికార్డుగా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలిచింది. దీనితో మహేష్ బాబు క్రేజ్ ఎంతవుందో అర్థం అవుతోంది కదా !

Mahesh Babu All Time Record: సూపర్ స్టార్ 'బిజినెస్ మేన్' అల్ టైం రికార్డు
Mahesh Babu from Businessman

మహేష్ బాబు (MaheshBabu) పుట్టినరోజు అయిన ఆగస్టు 9 (MaheshBabuBirthdayCelebrations) న మళ్ళీ విడుదలైన 'బిజినెస్ మేన్' #Businessman4K విజయఢంకా మోగించింది. సాంఘీక మాధ్యమాల్లో ఇప్పుడు మహేష్ బాబు #HBDSSMB, 'బిజినెస్ మేన్' ఈ రెండూ వైరల్ అవుతున్నాయి. మళ్ళీ ఇలా విడుదలైన సినిమాలలో మొదటి రోజు కలెక్షన్స్ ఈ 'బిజినెస్ మేన్' అల్ టైం రికార్డుగా చెపుతున్నారు. మహేష్ అభిమానులకు అయితే నిన్నటి నుండి పండగే. అంత పెద్దగా ప్రచారం లేకపోయినా మహేష్ బాబు సినిమా మళ్ళీ విడుదలై ఇంతటి కలెక్షన్ల వర్షం కురిపించిందంటే అది మామూలు విషయం కాదు.

maheshbabu-alltimerecord.jpg

దీనితో మహేష్ బాబుకి #SSMB వున్న క్రేజ్ ఏంటో అర్థం అయిపోతుంది. పూరి జగన్నాధ్ (PuriJagannadh) దర్శకత్వం వహించిన ఈ 'బిజినెస్ మేన్' #Businessman అప్పట్లోనే ఒక సంచలనం సృష్టించింది. అలాగే పూరి జగన్ ఈ సినిమాని అతి తక్కువ రోజుల్లో తీసి పూర్తి చేసాడు. అప్పట్లో ఒక అగ్ర నటుడు, ఒక సూపర్ స్టార్ తో పూరి జగన్ ఇలా తొందరగా ఒక సినిమా పూర్తి చెయ్యడం కూడా సంచలనంగా మారింది. అప్పుడే 2011లో వచ్చిన 'దూకుడు' #Dookudu, తరువాత ఈ 'బిజినెస్ మేన్', దీని తరువాత వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' #SeethammaVakitloSirimalleChettu ఇలా వరసగా హిట్ మీద హిట్ ఇస్తూ మహేష్ అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి కూడా తెలిసిందే.

maheshbabu-alltimerecord1.jpg

ఇప్పుడు ఈ 'బిజినెస్ మేన్' మళ్ళీ విడుదలై ఎంత కలెక్టు చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కొన్ని స్పెషల్ షోస్ వెయ్యగా మొత్తం రూ.4.42 (Rs 4.42 crore gross) కోట్లు గ్రాస్ వసూల్ చేసి అల్ టైం రికార్డు (AllTimeRecord) గా నిలిచింది. ఇది మళ్ళీ విడుదలైన సినిమాలలో మొదటి రోజు కలక్షన్స్ రికార్డుగా చెపుతున్నారు. ఇది ఇప్పుడు సాంఘీక మాధ్యమంలో వైరల్ అయింది.

Updated Date - 2023-08-10T16:19:46+05:30 IST