‘ఐ హేట్ మ్యారేజ్’ కేవలం బోల్డ్ సినిమా కాదు.. దర్శకుడు ఏం చెప్పారంటే

ABN , Publish Date - Nov 25 , 2026 | 11:01 AM

నేటి తరం యువత ఆలోచనలు, ప్రేమ, పెళ్లి పట్ల వారికున్న అభిప్రాయాల నేపథ్యంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఐ హేట్ మ్యారేజ్’. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు.

I Hate Marriage Still

నేటి తరం యువత ఆలోచనలు, ప్రేమ, పెళ్లి పట్ల వారికున్న అభిప్రాయాల నేపథ్యంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఐ హేట్ మ్యారేజ్’ (I Hate Marriage). సుగి విజయ్ (Sugi Vijay), జుప్సీ భద్ర (Jupsi Bhadra) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి పరమేష్ రేణుకుంట్ల (Director Paramesh Renikunthla) దర్శకత్వం వహించారు. ఆర్య సినిమా పతాకంపై మాదం దయానంద్, కార్తీక్ వెంపటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ సి. కుమార్ ఛాయాగ్రహణం, వరికుప్పల యాదగిరి సంగీతం, ఆవుల వెంకటేష్ ఎడిటింగ్ అందించిన ఈ చిత్రం ఈ నెల 27న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో, తాజాగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించింది.


దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల మాట్లాడుతూ.. ‘‘మన కళ్లముందు జరుగుతున్నప్పటికీ బయటకు మాట్లాడుకోవడానికి ఇష్టపడని సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ట్రైలర్ చూడగానే ఇంత బోల్డ్ కంటెంట్‌తో ఎందుకు వస్తున్నావని చాలామంది అడిగారు. కానీ ఇది కేవలం బోల్డ్ సినిమా కాదు, నేటి సమాజంలోని వాస్తవాలను చూపించే మెచ్యూర్డ్ అండ్ హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీ. ఈ రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి తిరుగుతున్నారు కానీ, పెళ్లి దగ్గరికి వచ్చేసరికి మాత్రం తల్లిదండ్రులు చూసిన సంబంధాలనే చేసుకుంటున్నారు. ప్రేమించిన వారి కోసం ఇంట్లో ఎందుకు పోరాడటం లేదు అనే అంశాన్ని ఇందులో చూపించాం. ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన వారి కథనే చూస్తున్నట్లు ఫీలవుతారు. నేటి జెన్-జీ (Gen Z) తరానికి కనెక్ట్ అయ్యే కథ ఇది’’ అని తెలిపారు.

నిర్మాత మాదం దయానంద్ మాట్లాడుతూ.. విజయ్ సి. కుమార్ (సినిమాటోగ్రాఫర్) మా సినిమాకు పనిచేస్తున్నారనగానే మాలో కొత్త ధైర్యం, కాన్ఫిడెన్స్ పెరిగాయి. ప్రేమ, పెళ్లి, కెరీర్‌తో పాటు స్వతంత్రంగా జీవించాలనే నేటి Gen Z యువత భావజాలాన్ని ఎలాంటి సినిమాటిక్ అతిశయోక్తులు లేకుండా సహజంగా చూపించామని అన్నారు. హీరోయిన్ జుప్సీ భద్ర మాట్లాడుతూ.. ఈ కథ వినగానే చాలా పవర్‌ఫుల్‌గా అనిపించిందని, యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా ఈ సినిమా నచ్చుతుందని పేర్కొన్నారు.


I-Hate-Marriage-PM.jpg

అతిథిగా హాజరైన నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘‘సొసైటీలో ఉన్న డార్క్ సీక్రెట్స్, డేరింగ్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. ఓ ముగ్గురు అమ్మాయిల జర్నీ, ఓ అబ్బాయి కథను దర్శకుడు ఎక్కడా బోర్ కొట్టించకుండా ఆసక్తికరంగా తెరకెక్కించారు. సినిమా విడుదలయ్యాక కచ్చితంగా దీని గురించి అందరూ చర్చించుకుంటారు’’ అని అభినందించారు. సంగీత దర్శకుడు వరికుప్పల యాదగిరి, ఎడిటర్ ఆవుల వెంకటేష్ మాట్లాడుతూ.. దర్శకుడు పరమేష్ ఎంతో తపనతో, రాజీ పడకుండా ఈ చిత్రాన్ని రూపొందించారని, నవంబర్ 27న విడుదలవుతున్న ఈ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

‘రామాయణ’ రికార్డ్ అవుట్.. రిలీజ్‌కు ముందే ‘అవెంజర్స్ : డూమ్స్‌డే’ సంచలనం

తరుణ్ భాస్కర్‌లో ఇంతటి ఆవేశానికి కారణమేంటి?

శ్రీలంకలో అల్లు ఫ్యామిలీ డిన్నర్ పార్టీ.. నెట్టింట క్రేజీ పిక్ వైరల్

Updated Date - Nov 25 , 2026 | 11:01 AM

I Hate Marriage: యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ 'ఐ హేట్‌ మ్యారేజ్‌' ప్రారంభం

రోషన్‌ మేకను సూపర్‌హీరోగా చూపించనున్న ఇంద్రగంటి!

శింబు 'అరసన్‌' నుంచి అనిరుధ్ ఔట్? నిర్మాత క్లారిటీ!

‘నాన్న కుట్టి’ ఫస్ట్ హాఫ్ బేస్‌.. సెకండాఫ్ ఎమోషన్: విజయ్ ఆంటోని

భార్య సయేషా సూచన.. కొత్త జానర్‌లోకి ఆర్య