Mahesh Babu Fan: మహేశ్ బాబుకు ఛలాన్లు.. తట్టుకోలేకపోయిన అభిమాని! ఏం చేశాడంటే
ABN , Publish Date - Nov 16 , 2025 | 04:10 PM
ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాతో టైటిల్ గ్లింప్స్‌తో గ్లోబల్‌స్థాయిలో మహేశ్ పేరు మార్మోగిపోతుంది. అయితే మరోలా కూడా మహేశ్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ (Varanasi) సినిమాతో టైటిల్ గ్లింప్స్‌తో గ్లోబల్‌స్థాయిలో మహేశ్ పేరు మార్మోగిపోతుంది. అందులో ఆయన లుక్, కంటెంట్, సినిమా జానర్ తెలిశాక అభిమానుల ఆనందానిక అవధుల్లేవు. అయితే మరోలా కూడా మహేశ్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ట్రాఫిక్ చలాన్ల విషయంలో. మహేశ్‌బాబు ప్రయాణించే వ్యక్తిగత కారుపై రెండు ఛలాన్లు (Challan on mahesh car) పడ్డాయి.
పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై స్పీడ్ లిమిట్ దాటడంతో రెండు చలాన్లు పడ్డాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్టులు రావడంతో ఓ అభిమాని ఆ ట్రోలింగ్‌ను తట్టుకోలేక వెంటనే రూ.2070 చలాన్లు స్వయంగా చెల్లించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది. మహేశ్‌పై ఉన్న అభిమానంతో క్షణాల్లో ఈ పని చేశాడు సదరు అభిమాని.