Mahesh Babu : దేశంలో అత్యుత్తమ నటుల్లో  ఆయనొకరు! 

ABN , First Publish Date - 2023-11-28T10:03:34+05:30 IST

‘యానిమల్‌’ (animal) ట్రైలర్‌ చూశా. మెంటల్‌ వచ్చేసిందంతే! ఇలాంటి ఒరిజినల్‌ ట్రైలర్‌ నేనింత వరకు చూడలేదు. దర్శకుడు సందీప్‌ రెడ్డి (Sandeep reddy vanga) అంటే నాకు చాలా ఇష్టం. రణ్‌బీర్‌కు (Ranbir kapoor) చాలా పెద్ద అభిమానిని. మన దేశంలో ఉన్న అత్యుత్తమ నటుల్లో ఆయనొకరు’’ అని మహేష్‌బాబు అన్నారు.

Mahesh Babu : దేశంలో అత్యుత్తమ నటుల్లో  ఆయనొకరు! 

‘‘యానిమల్‌’ (animal) ట్రైలర్‌ చూశా. మెంటల్‌ వచ్చేసిందంతే! ఇలాంటి ఒరిజినల్‌ ట్రైలర్‌ నేనింత వరకు చూడలేదు. దర్శకుడు సందీప్‌ రెడ్డి (Sandeep reddy vanga) అంటే నాకు చాలా ఇష్టం. రణ్‌బీర్‌కు (Ranbir kapoor) చాలా పెద్ద అభిమానిని. మన దేశంలో ఉన్న అత్యుత్తమ నటుల్లో ఆయనొకరు’’ అని మహేష్‌బాబు అన్నారు. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన చిత్రం 'యానిమల్‌’. అనిల్‌ కపూర్‌, బాబీ దేవోల్‌ కీలక పాత్రధారులు. భూషణ్‌ కుమార్‌, క్రిషన్‌ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మించారు. డిసెంబర్‌ 1న పాన్  ఇండియా స్థాయిలో చిత్రం విడుదల కానుంది. సోమవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 

రోమాలు నిక్కబొడుచుకున్నాయి: మహేష్‌బాబు(Maheshbabu)

మాట్లాడుతూ ''సందీప్‌రెడ్డి వంగా అంటే నాకెంతో ఇష్టం. ఆయన సినిమాల్లాగే తను ఎంతో ప్రత్యేకం. ఈ వేడుక చూస్తుంటే వంద రోజుల ఫంక్షన్‌లా ఉంది. నేను రణ్‌బీర్‌కు చాలా పెద్ద అభిమానిని. ఇది వరకే ఆయనకు ఈ మాట చెప్పా అంతగా పట్టించుకోలేదు. అందుకే ఈ వేదికగా మరోసారి చెబుతున్నా. మన దేశంలో ఉన్న అత్యుత్తమ నటుల్లో ఆయనొకరు. ట్రైలర్‌లో కొన్ని సన్నివేశాల్లో రణ్‌బీర్‌ నటన చూసి నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఈ చిత్రం చాలా  పెద్ద విజయం సాధించాలి’’ అని అన్నారు. 

Untitled-1.jpg

‘యానిమల్‌’ టాప్‌లో ఉంటుంది: రాజమౌళి (Rajamouli)

దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ ''ప్రతి సంవత్సరం సినిమా పరిశ్రమకి చాలామంది కొత్త దర్శకులు వస్తుంటారు. మంచి కంటెంట్‌తో సినిమాలు తీసి విజయం సాధిస్తుంటారు. కానీ, ‘సినిమా అంటే ఇలాగే తీయాలి’ అనే సినీ సూత్రాల్ని షేక్‌ చేసే దర్శకులు అప్పుడప్పుడు ఒకరు వస్తుంటారు. నాకు తెలిసి ఆ తరంలో అలా వచ్చిన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. ఈ తరంలో సందీప్‌ రెడ్డి వంగా. ‘యానిమల్‌’ టీజర్‌ చూసినప్పుడే ఈ సినిమా తప్పకుండా చూడాలనిపించింది. బాలీవుడ్‌లో నాకిష్టమైన నటుడు రణ్‌బీర్‌ కపూర్‌. ఆయన 15 ఏళ్ల కెరీర్‌లో తన ప్రత్ఘిభను  చూపించుకునే సినిమాలు చాలా తక్కువ వచ్చాయి. వాటిలో ‘యానిమల్‌’ టాప్‌లో ఉంటుంది. థియేటర్‌లోనే చూడాల్సిన సినిమా ఇది’’ అని అన్నారు. 

ఆ భావనలో ఉండకండి: సందీప్‌రెడ్డి (Sandeep reddy)

దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా మాట్లాడుతూ ''మంచి తండ్రీకొడుకుల ప్రేమకథ ఇది. ఇలాంటి ప్రేమకథ ఇంత వరకు చూసి ఉండరు. నిడివి ఎక్కువనే భావనలో ఉండకండి. కచ్చితంగా అందర్నీ అలరిస్తుంది. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక, అనిల్‌ కపూర్‌ లాంటి అద్భుతమైన నటీనటుటు ఉన్నప్పుడు నిడివి గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు. ఏ ఒక్కర్నీ ఈ చిత్రం నిరుత్సాహ పరచదు అని మాటిస్తున్నా’’ అన్నారు 

మహేశ్‌కు మెసేజ్‌ పెట్టా: రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir kapoor)

‘‘ఇంత ఎమోషనల్‌ కథలో నన్ను భాగం చేసినందుకు సందీప్‌ రెడ్డి వంగాకు కృతజ్ఞతలు. నేను నటుణ్ని అయితే నాకు తండ్రి నటిస్తానని అనిల్‌ కపూర్‌ ఒకప్పుడు మాటిచ్చారు. అది ఈ సినిమాతో నెరవేరింది. రాజమౌళి లాంటి గొప్ప దర్శకులు ఈ ప్రపంచంలో లేరు. ఈ చిత్రానికి ఆయన అందిస్తున్న ప్రోత్సాహానికి థ్యాంక్స్‌ అనే మాట చాలా తక్కువ అవుతుంది. . మహేశ్‌ నటించిన ‘ఒక్కడు’ సినిమా నాకు బాగా నచ్చింది. ఆ సినిమా చూసిన వెంటనే ఆయనకు మెసేజ్‌ పెట్టా. నా సినిమా వేడుకకు ఆయన అతిథిగా రావడం ఆనందంగా ఉంది’’ అని రణ్‌బీర్‌ కపూర్‌ అన్నారు. 

Animal.jpg

వైలెంట్‌ సినిమా కాదు: రష్మిక మందన్నా (Rashmika Mandanna)

‘‘యానిమల్‌’ వైలెంట్‌ సినిమా కాదు. ఇదొక చక్కని ఫ్యామిలీ డ్రామా. దీంట్లో ఉన్న ప్రతి పాత్ర ప్రత్యేకమైనదే’’ అని అన్నారు. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, బాబీ దేవోల్‌, అనిల్‌ కపూర్‌, భూషణ్‌ కుమార్‌, దిల్‌రాజు, ప్రణయ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు


Updated Date - 2023-11-28T11:19:17+05:30 IST