JD Chakravarthy: ‘గాయపడ్డ సింహం’లో నేను, తరుణ్ కాకుండా ఇంకో సింహం ఉంది!

ABN , Publish Date - Apr 23 , 2026 | 07:37 PM

దర్శకుడు తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన విలక్షణ నటుడు జె.డి. చక్రవర్తి చిత్ర విశేషాలను పంచుకున్నారు.

JD Chakravarthy

దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker), రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’ (Gaayapadda Simham)గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో.. కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో విలక్షణ నటుడు జె.డి. చక్రవర్తి (JD Chakravarthy) కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ యమా జోరుగా నడుస్తున్నాయి. మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను జె.డి. చక్రవర్తి మీడియాకు తెలియజేశారు.


ఆయన మాట్లాడుతూ.. ‘‘క్యారెక్టర్ ఆర్క్‌లో ఏదైనా ఛాలెంజ్ ఉంటే ఏ నటుడికైనా ఒక ఎగ్జయిట్‌మెంట్ కలుగుతుంది. ధర్మా క్యారెక్టర్ గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు ఒక విషయం చెప్పాను, మళ్లీ అదే చెబుతున్నాను. కమల్ హాసన్ చేసిన క్యారెక్టర్లు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదు. అయితే ‘గాయపడ్డ సింహం’లో యాక్టర్‌గా కాదు, క్యారెక్టర్ పరంగా ఆయనకు రాని అదృష్టం నాకు వచ్చిందని భావిస్తున్నాను. అలాంటి ఒక డిఫరెంట్ పాత్రని ఇందులో చేశాను. ఒకే క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్‌లో ఒకలా, సెకండ్ హాఫ్‌లో మరోలా ఉండటం మామూలే. కానీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండింటిలో ఒకే విధంగా కనిపిస్తూ, రెండు తరహాల పాత్రని ఇందులో నేను పోషించాను. అదే నన్ను బాగా ఎగ్జైట్ చేసింది. నిజంగా ఈ పాత్ర చేయడానికి నేను చాలా కష్టపడ్డాను అని చెప్పడం లేదు. కథలోనే ఆ బలం, మ్యాజిక్ కుదిరిందని చెబుతున్నాను. నేను ఎలా పడితే అలా సినిమాలు చేయను. నాకు ప్రాపర్‌గా కథ నచ్చాలి.

JD-Chakravarthy-pic.jpg

కథ వర్కవుట్ అయితేనే ఏ సినిమా అయినా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ‘శివ’లో నేను చేసిన పాత్ర నా పేరుగా మారిపోయింది. చక్రవర్తి అంటే ఎవరూ గుర్తుపట్టరు, జేడీ చక్రవర్తి అంటే గుర్తుపడతారు. అలాగే భవాని, సత్య, భీకు మాత్రే, కల్లుమామ ఇలా చాలా పాత్రలు అలా గుర్తుండిపోయాయి. మళ్లీ చెబుతున్నా.. కథ వర్కవుట్ కాకపోతే క్యారెక్టర్లు నిలవవు. ఒకవేళ నిలిచినా.. సినిమా ఆడదు. నా కెరీర్‌లో నాకు ఫేవరెట్ క్యారెక్టర్ ‘వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్’. ఆ పాత్ర వర్కవుట్ అయ్యింది.. కానీ సినిమా ఆడలేదు.


‘గాయపడ్డ సింహం’లో తరుణ్ భాస్కర్ ఎక్కువగా గాయపడ్డాడు, నేను గాయపడ్డాను, ఇంకో సింహం కూడా గాయపడింది. ఆ సింహం ఎవరో త్వరలో రివీల్ చేస్తాం. ఈ కథను దర్శకుడు చాలా కొత్తగా ప్రెజెంట్ చేశారు. ఇందులో ధర్మ క్యారెక్టర్, తరుణ్ భాస్కర్ చేసిన దరహస్, ఇంకో పాత్ర.. ఇవన్నీ కలిసే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌కు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌‌లు చేసిన మంచి అనుభవం వుంది. తన స్టైల్ నాకు చాలా నచ్చింది. రియలిస్టిక్, హిలేరియస్ హ్యూమర్‌తో ఈ సినిమా తీశాడు. ఈ సినిమాలో నా పాత్ర పేరు ‘బ్రూటల్ ధర్మ’. కానీ నేను స్క్రీన్‌పై చేసే పనులకు ప్రేక్షకులు నవ్వకుండా ఉండలేరు. ఇది డైరెక్టర్స్ ఫిల్మ్ అని నేను చెబుతూ వస్తున్నాను. అంటే, ఇందులో నేను, తరుణ్ భాస్కర్, పవన్ సాదినేని వంటి చాలా మంది డైరెక్టర్స్ ఉన్నాము. అయితే మేము మాత్రం ఎటువంటి ఇన్‌పుట్స్ ఇవ్వలేదు. కశ్యప్ చెప్పిన విధంగానే సినిమా తీశాడు. ముఖ్యంగా నా పాత్ర చెబుతున్నప్పుడు.. నవ్వుతూనే ఉన్నాను. ఈ సినిమాకు మంచి టెక్నికల్ టీమ్ కుదిరింది. ఎడిటర్ విప్లవ్ ఎడిటింగ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా డైరెక్టర్ విజన్‌కి తగ్గట్టుగా పనిచేశారు. నా విషయానికి వస్తే.. మళ్లీ ఎక్స్‌పెరిమెంటల్ చేస్తాను. ఎందుకంటే, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. హీరో, విలన్ ఇలాంటివి బేరీజు వేసుకొను. కథ కొత్తగా ఉంటే చాలు.. చేస్తాను’’ అని జె.డి. చక్రవర్తి చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

ఓటు ఎవరికి వేశాడో.. పబ్లిగ్గా చెప్పేసిన వీటీవీ గణేష్.. వీడియో వైరల్!

ధనుష్ - మృణాల్.. మళ్లీ మొదలు! అసలు విషయం ఏమిటంటే?

చిరంజీవి ఇంటికి సమీపంలోనే అల్లు అర్జున్ లగ్జరీ హౌస్.. ఎన్ని కోట్లంటే?

Updated Date - Apr 23 , 2026 | 07:41 PM

Gayapadda Simham: ఇద్ద‌రు బామ‌ల‌తో తరుణ్ భాస్కర్.. 'గాయపడ్డ సింహం' టీజర్ వచ్చేస్తోంది

Tharun Bhascker: 'ఓం శాంతి శాంతి శాంతిః' హార్ట్ టచ్చింగ్ థీమ్ సాంగ్ రిలీజ్

JD Chakravarthy: ఆ టైటిల్ కొట్టేద్దామనుకున్నా..

JD Chakravarthy: ఇన్‌స్టా.. ఖాతా తెరిచిన జేడీ! నేనూ దేవుడిని న‌మ్మా.. కానీ అని వ్యాఖ్య‌లు

JD Chakravarthy: రంభ తొడలు చూడటానికి నేను చక్రి అర్థరాత్రి వెళ్లాం: ఉత్తేజ్