Tharun Bhascker: 'ఓం శాంతి శాంతి శాంతిః' హార్ట్ టచ్చింగ్ థీమ్ సాంగ్ రిలీజ్
ABN, Publish Date - Jan 08 , 2026 | 09:02 PM
ట్యాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న సినిమా 'ఓం శాంతి శాంతి శాంతిః. ఎ.ఆర్. సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం నుండి థీమ్ సాంగ్ విడుదలైంది. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్ , నవీన్ సనివరపు నిర్మిస్తున్న ఈ సినిమాలోని ఈ గీతాన్ని ప్రతి మహిళకు అంకితం ఇస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు. భరద్వాజ్ గాలి రాసిన ఈ పాటకు జయ్ కృష్ణ స్వరాలు సమకూర్చగా, అభయ్ జోధ్ పుర్కర్ పాడారు. ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని డైలాగ్స్ రాస్తున్నారు. 'ఓం శాంతి శాంతి శాంతిః' జనవరి 23న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
Updated at - Jan 08 , 2026 | 09:02 PM