JD Chakravarthy: ఆ టైటిల్ కొట్టేద్దామనుకున్నా..

ABN , First Publish Date - 2023-05-02T20:27:36+05:30 IST

టైటిల్ చూడగానే.. అరే ఇంత మంచి టైటిల్‌ని ఇప్పటి వరకు వదిలేశారేంటి? అని అనిపించింది. అందుకే ఈ చిత్ర నిర్మాత సిరాజ్‌ని టైటిల్ రిజిస్టర్ చేయించారా? అని అడిగా

JD Chakravarthy: ఆ టైటిల్ కొట్టేద్దామనుకున్నా..
JD Chakravarthy

నిర్మాత కనుక ఆ టైటిల్‌ని రిజిస్టర్ చేయించకపోతే.. కొట్టేసేవాడిని అని అన్నారు సీనియర్ నటుడు జెడీ చక్రవర్తి (JD Chakravarthy). ఇంతకీ ఆయన కొట్టేస్తానంటున్న టైటిల్ ఏమటనుకుంటున్నారా? 1981లో సూపర్ కృష్ణ హీరోగా నటించిన ‘అంతం కాదిది ఆరంభం’ (Antham Kadidi Aarambam). ఇప్పుడీ టైటిల్‌తో క్రసెంట్ సినిమాస్, కృష్ణ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నూతన దర్శకుడు ఇషాన్ (Ishaaon) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ప్రభు పౌల్‌రాజ్, సిరాజ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ లుక్ ‌పోస్టర్‌ (Antham Kadidi Aarambam Title Look Launch)ని జె.డి. చక్రవర్తి ఆవిష్కరించారు. పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ..

‘‘టైటిల్ చూడగానే.. అరే ఇంత మంచి టైటిల్‌ని ఇప్పటి వరకు వదిలేశారేంటి? అని అనిపించింది. అందుకే ఈ చిత్ర నిర్మాత సిరాజ్‌ని టైటిల్ రిజిస్టర్ చేయించారా? అని అడిగాను. ఒకవేళ చేయించకపోతే నేను కొట్టేసేవాడిని. ఈ రోజుల్లో కథలు కొట్టేయడం కామన్.. ఇవాళ సరైన టైటిల్ దొరకడం లేదు. ‘అంతం కాదిది ఆరంభం’ (Antham Kadidi Aarambam) అనేది పాజిటివ్ అండ్ అద్భుతమైన టైటిల్. నా చిన్నప్పుడు ఇదే టైటిల్‌తో సూపర్‌స్టార్ కృష్ణ (Super Star Krishna)గారు సినిమా చేశారు. విజయనిర్మల‌ (Vijaya Nirmala)గారు ఆ సినిమాకి డైరెక్టర్. హైదరాబాద్ సుదర్శన్ 70MMలో రిలీజైంది. ఏంటీ.. గూగుల్‌లో సెర్చ్ చేసి చెబుతున్నానని అనుకుంటున్నారేమో.. కాదు.. నేనప్పుడు ఆ థియేటర్‌లో సినిమా చూశాను కాబట్టి చెబుతున్నాను. అయినా గూగుల్ సుదర్శన్ 70MM అని చెప్పదు కదా. అలా ఈ టైటిల్ నాకు బాగా గుర్తిండిపోయింది.

Chakra.jpg

ఇక ఈ టైటిల్‌తో సినిమా అంటే.. అన్నం అంతా చూడక్కరలేదు అనే సామెతలా.. ఈ టైటిల్ చూస్తుంటే ఇది మంచి సినిమా అని ఖచ్చితంగా నమ్మవచ్చు. నమ్మకంగా థియేటర్స్‌కి వెళ్లి చూడవచ్చు.. న్యూ టీమ్ అంతా కలిసి చేస్తున్న ఈ చిత్రం ఘన విజయం సాధించి.. అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్’’ అని జె.డి చక్రవర్తి చెప్పుకొచ్చారు. టైటిల్ లుక్ పోస్టర్‌ని విడుదల చేసిన జె.డి. చక్రవర్తికి చిత్ర దర్శకనిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను తెలియజేస్తామని వారు ప్రకటించారు. ఇషాన్, ప్రణాళి, రాకెట్ రాఘవ, ప్రవీన్, కరాఠే కళ్యాణి, గీతాసింగ్, నాగమహేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి వినోద్ యాజమాన్య సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Heat Trailer Talk: ప్రత్యర్థిని అంచనా వేసేవాడు.. ప్రెజర్‌ను హ్యాండిల్ చేసేవాడే విన్నర్

* The Kerala Story: కథ నిజమని నిరూపించండి.. కోటీశ్వరులు కండి!

*Naga Chaitanya: నా లైఫ్‌లో ఇప్పటి వరకు నేను బాధపడలేదు

*Sarath Kumar: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 సినిమాలు

*Balagam: కానిస్టేబుల్ పరీక్షలో సినిమాపై ప్రశ్న.. ఫూలిష్ క్వశ్చన్ అంటూ నెటిజన్ల ఫైర్

Updated Date - 2023-05-02T20:27:36+05:30 IST