Gayapadda Simham: ఇద్ద‌రు బామ‌ల‌తో తరుణ్ భాస్కర్.. 'గాయపడ్డ సింహం' టీజర్ వచ్చేస్తోంది

ABN , Publish Date - Feb 06 , 2026 | 05:28 PM

తరుణ్‌ భాస్కర్ హీరోగా ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'గాయపడ్డ సింహం'. ఫిబ్రవరి 9న ఈ సినిమా టీజర్ విడుదల కాబోతోంది.

Gayapadda Simham Movie

విభిన్న కథా చిత్రాలకు ప్రాధాన్యమిచ్చే తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) , రైటర్ కమ్ డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌ కాంబోలో ఓ సినిమా రాబోతోంది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 'ఆకాశంలో ఒక తార' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పవన్ సాదినేని వీరి సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మిస్తున్నారు.

శుక్రవారం ఈ సినిమాకు 'గాయపడ్డ సింహం' (Gayapadda Simham) అనే పేరు ఖరారు చేసినట్టు తెలుపుతూ, పోస్టర్ ను విడుదల చేశారు. అమెరికన్ శైలిలో ఉన్న ఎరుపు-తెలుపు రంగుల బొమ్మలతో నిండిన ఈ డిజైన్‌లో, అమెరికా జెండాను గుర్తుచేసే నక్షత్రాలు, నిలువు గీతల నేపథ్యంలో దూసుకుపోతున్న విమానం కనిపిస్తోంది. పాస్‌పోర్ట్ స్టాంప్ ఒక సాహసోపేతమైన, వ్యంగ్య కథనాన్ని సూచిస్తోంది. రివాల్వర్, డొనాల్డ్ ట్రంప్‌ను పోలి ఉన్న క్యారికేచర్, నటరాజ్ కాంపస్ బాక్స్ ఇవన్నీ ఆసక్తికరంగా వున్నాయి. ఈ అంశాలు పొలిటికల్ సెటైర్, క్రైమ్, కామెడీ కలగలిసిన ఎంటర్ టైనర్ ను మేకర్స్ ఇవ్వబోతున్నారని అనిపిస్తోంది. 'నవ్వకండి! ఇది చాలా సీరియస్ మేటర్!' అనే ట్యాగ్‌లైన్ మరింత హిలేరియస్ గా వుంది. ఒక్క పాట చిత్రీకరణ మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యిందని, టీజర్ ను ఫిబ్రవరి 9న విడుదల చేయబోతున్నామని మేకర్స్ తెలిపారు.

WhatsApp Image 2026-02-06 at 4.48.50 PM.jpeg


ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), మానస చౌదరి (Manasa Chowdary) కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'గాయపడ్డ సింహం' చిత్రానికి సూర్య ప్రకాశ్‌ జోస్యుల కథను అందించగా, విద్యాసాగర్ చింత సినిమాటోగ్రఫీని, స్వీకర్ అగస్తి సంగీతాన్ని అందిస్తున్నారు, విప్లవ్ నైషధం ఎడిటర్ కాగా ప్రొడక్షన్ డిజైనర్ గా చంద్రిక గొర్రెపాటి వ్యవహరిస్తున్నారు.

Updated Date - Feb 06 , 2026 | 07:21 PM