సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హీరో రామ్ పోతినేని.. ఇంకా బ్యాచ్‌లర్‌గా ఉండటానికి కారణం ఇదేనా?

ABN, Publish Date - Apr 14 , 2026 | 02:45 PM

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో టాప్‌లో ఉన్న రామ్.. తాజాగా తన పెళ్లి గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

Ram Pothineni

టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ స్టార్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు రామ్ పోతినేని (Ram Pothineni). వెండితెరపై తన డ్యాన్స్‌లతో, యాక్టింగ్‌తో కుర్రకారును ఉర్రూతలూగించే ఈ హీరో.. రియల్ లైఫ్‌లో మాత్రం చాలా సైలెంట్‌గా ఉంటారని చాలా కొద్ది మందికే తెలుసు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో టాప్‌లో ఉన్న రామ్.. తాజాగా తన పెళ్లి గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ‘దేవదాసు’ (Devadasu) సినిమాతో చాక్లెట్ బాయ్‌గా ఎంట్రీ ఇచ్చి, కుర్రాళ్ళను ఇన్‌స్పైర్ చేస్తూ, అమ్మాయిల కలల రాకుమారుడిగా మారారు రామ్. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంత సందడిగా ఉన్నా, రామ్ (Hero Ram) వ్యక్తిగతంగా మాత్రం చాలా రిజర్వ్‌డ్.


రామ్ మాటల్లోనే చెప్పాలంటే.. సోలో లైఫే సో బెటర్. షూటింగ్ స్పాట్‌లో వందల మంది ఉన్నా, తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించుకోవడం రామ్‌కు అలవాటు. ‘చిన్నప్పటి నుంచి నాకు ఒంటరిగా ఉండటమే ఇష్టం. నేను చాలా రిజర్వ్‌డ్ పర్సన్‌‌ని’ అంటూ రామ్ ఓపెన్ అయ్యారు. మరి పెళ్లి ఎప్పుడు అంటే.. ‘నా జీవితంలోకి ఎవరైనా వస్తే సంతోషంగా ఆహ్వానిస్తాను, ఒకవేళ రాకపోయినా పర్వాలేదు’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంటే పెళ్లి విషయంలో రామ్ చాలా క్లారిటీతో ఉన్నారని అర్థమవుతోంది. ఇక రామ్ కెరీర్ విషయానికి వస్తే.. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. రీసెంట్‌గా వచ్చిన ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ సినిమా మిక్స్‌డ్ రెస్పాన్స్ అందుకున్నప్పటికీ, రామ్ తన ఎనర్జీతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఒక భారీ హిట్‌తో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.


ప్రస్తుతం కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అసిస్టెంట్, లోగి విఘ్నేష్ దర్శకత్వంలో రామ్ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లోకేష్ స్కూల్ నుంచి వస్తున్న డైరెక్టర్ అంటే ఖచ్చితంగా ఆ సినిమాలో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. దీనితో పాటు బాహుబలి వంటి విజువల్ వండర్స్‌ను నిర్మించిన ఆర్కా మీడియా బ్యానర్‌లో ఒక భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలు రామ్ కెరీర్‌లో మైలురాళ్లుగా నిలుస్తాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉన్నా, పర్సనల్ లైఫ్‌లో మాత్రం ప్రశాంతతను వెతుక్కునే రామ్ పోతినేని.. త్వరలోనే తన కొత్త చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఇవి కూడా చదవండి:

దేవుడిచ్చిన బాడీని.. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేయడానికి వాడుతున్నా! - విష్ణుప్రియ

అమ్మాయిలు చూస్తున్నారని, నాన్న కొడుతున్నా పారిపోలేదు -రాజశేఖర్

అన్నీ ఉన్నాయ్ కానీ.. అన్నా లెజినోవా షాకింగ్ పోస్ట్!

షూటింగ్ బ్రేక్‌లో పాయల్ రాజ్‌పుత్ చేసే పనులివా?

‘చిరంజీవి’కి మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్

UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!

Updated Date - Apr 14 , 2026 | 02:45 PM