Ram Pothineni : ఆ బయోపిక్‌లో అవకాశం వస్తే చేస్తా!

ABN , First Publish Date - 2023-09-23T20:36:26+05:30 IST

విరాట్‌ కోహ్లి గురించి రామ్‌ పోతినేని (Ram Pothineni) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో చాలామంది రామ్‌కు టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కోహ్లీకి దగ్గరి పోలికలు ఉన్నాయనీ, ఇద్దరి ఫేస్‌ కట్‌ ఒకేలా ఉంటుందని చాలామంది చెబుతుండేవారు.

Ram Pothineni : ఆ బయోపిక్‌లో అవకాశం వస్తే చేస్తా!

విరాట్‌ కోహ్లి గురించి రామ్‌ పోతినేని (Ram Pothineni) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో చాలామంది రామ్‌కు టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కోహ్లీకి దగ్గరి పోలికలు ఉన్నాయనీ, ఇద్దరి ఫేస్‌ కట్‌ ఒకేలా ఉంటుందని చాలామంది చెబుతుండేవారు. సోషల్‌ మీడియాలోనూ వీరిద్దరి ఫోటోలకు పోలిక తెస్తూ వైరల్‌ చేశారు అభిమానులు. ఇదే విషయంపై తాజాగా రామ్‌ స్పందించాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘స్కంద’ చిత్రం ఈ నెల 28న విడుదల కానున్న నేపథ్యంలో రామ్‌ ప్రముఖ వాయిస్‌ ఆర్టిస్ట్‌ సంకేత్‌ మాత్రేకు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. సంకేత్‌ మాత్రే హిందీలో రామ్‌కు, అల్లు అర్జున్‌కు డబ్బింగ్‌ చెబుతుంటారు.

ఈ ఇంటర్వ్యూలో సంకేత్‌.. ‘విరాట్‌ కోహ్లిలా ఉన్నావని చాలా మంది నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. ఒకవేళ ఆయన బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే చేస్తారా; అని ప్రశ్నించారు. దానికి రామ్‌ ‘విరాట్‌లా ఉన్నానని చాలా మంది చాలాకాలంగా అంటున్నారు. ఇస్మార్ట్‌ శంకర్‌’ కోసం లుక్‌ డిసైడ్‌ చేశాక సోషల్‌ మీచి?యాలో పోస్ట్‌ చేశా. అప్పటి నుంచి ఈ పోలిక వచ్చింది. ఇండియన్‌ స్టార్‌ క్రికెటర్‌తో కంపేర్‌ చేయడం నాకు హ్యాపీనే. తన బయోపిక్‌లో నటించే అవకాశం వేస్త.. తప్పకుండా చేస్తా విరాట్‌ బయోపిక్‌ అంటే ఎగ్జైటింగ్‌గా ఉంటుంది’ అని సమాధానమిచ్చారు. ‘అఖండ’ లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రమిది. రామ్‌ సరసన శ్రీలీల కథానాయికగా నటించింది.

Updated Date - 2023-09-23T20:36:26+05:30 IST