సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

గోపీచంద్ 33వ చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

ABN, Publish Date - Apr 13 , 2026 | 05:17 PM

గోపీచంద్ హీరోగా, సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చారిత్రక యాక్షన్ డ్రామా చిత్రానికి టైటిల్ ఖరారు చేస్తూ, సోమవారం గ్లింప్స్‌ను విడుదల చేశారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ మూవీ టైటిల్‌‌కు సంబంధించిన పోస్ట్‌లు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

Gopichand 33 Movie Bharata Varsha

గోపీచంద్ (Gopichand) హీరోగా, సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy) దర్శకత్వంలో రూపొందుతోన్న చారిత్రక యాక్షన్ డ్రామా చిత్రానికి టైటిల్ ఖరారు చేస్తూ, సోమవారం గ్లింప్స్‌ను విడుదల చేశారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ మూవీ టైటిల్‌‌కు సంబంధించిన పోస్ట్‌లు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ టైటిల్ రిజిస్టర్ అయిందో లేదో, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మీడియా వాళ్లు లీక్ చేసేశారు. అదే టైటిల్‌ని ఖరారు చేస్తూ.. మేకర్స్ గ్లింప్స్‌ని వదిలారు. ఇంతకీ మూవీ టైటిల్ ఏమిటంటే.. ‘భరతవర్ష’ (Bharata Varsha). శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై, పవన్ కుమార్ సమర్పణలో నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలలో ఒకటిగా, భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీ గ్లింప్స్ ఎలా ఉందంటే..


క్రీ.శ. 642 నేపథ్యంలో సాగే ఈ గ్లింప్స్, శూల భూమిలో ప్రారంభమై.. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. ‘హరిహర వీరమల్లు’ తరహా సినిమా ఇదని ఈ గ్లింప్స్ తెలియజేస్తోంది. భారీ యుద్ధ సన్నివేశాలు, యుద్ధంలో ఆరితేరిన యోధుల క్లోజప్‌లు, కత్తులు, గొడ్డళ్లు, అగ్నిజ్వాలల మధ్య జరిగే పోరాటాలు.. కలగలిపి విజువల్ ఫీస్ట్ అనేలా ఈ గ్లింప్స్ ఉంది. భరత భూమికి (భారతదేశానికి) ప్రతీకగా నిలిచే ‘భరతవర్ష’ టైటిల్‌ని రివీల్ చేసిన తీరు కూడా పవర్ ఫుల్‌గా వుంది. విజువల్స్‌, ప్రొడక్షన్ డిజైన్‌, గత యుగాన్ని ఎంతో నైపుణ్యంతో పునర్నిర్మించిన తీరు అద్భుతంగా వుందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


దర్శకుడు సంకల్ప్ రెడ్డి తన విజన్‌ని ప్రతిబింబిస్తూ, భారతదేశ చరిత్రలో ఎక్కువగా పరిశీలించని ఒక అధ్యాయాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని.. భారీ స్థాయిలో, భావోద్వేగపూరిత కథనంతో, గొప్ప యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంటోందని మేకర్స్ తెలియజేస్తున్నారు. అలాగే హీరో గోపీచంద్ ఇప్పటి వరకు చేయని యోధుడి పాత్రలో ఇందులో కనిపిస్తున్నారు. దీని కోసం ఆయన కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. ఆయన ఫిజిక్, నటన, స్క్రీన్ ప్రెజెన్స్.. అన్నీ కలిసి పాత్రను ఎంతో నిజాయితీగా కనిపించేలా చేశాయి. గోపీచంద్ సరసన హీరోయిన్‌గా రీతూ వర్మ నటిస్తున్నారు. భారతీయ సినిమాల్లో గుర్తుండిపోయే హిస్టారికల్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా వేగంగా జరుగుతోందని నిర్మాత తెలిపారు.

ఇవి కూడా చదవండి:

సింగర్ మంగ్లీ కేసులో ట్విస్ట్.. ఇదంతా బిగ్‌బాస్ కోసమేనా?

లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే మృతి.. ప్రముఖుల నివాళులు

ఎం.ఎస్. రాజు రూటు మార్చారు.. ఈసారి నో ఫీలింగ్స్!

Chiranjeevi: చిరంజీవికి తప్పని వెయిటింగ్.. ఈ అడ్డంకులేంటి?

Venu Udugula: మంగ్లీ ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు

UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!

Updated Date - Apr 13 , 2026 | 05:17 PM