Gopichand 33: భారత చరిత్రలో వెలుగులోకి రాని అధ్యాయం..
ABN , Publish Date - Jan 23 , 2026 | 07:02 PM
మ్యాచో స్టార్ గోపీచంద్, సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి భారీ స్థాయిలో ఓ హిస్టారికల్ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
మ్యాచో స్టార్ గోపీచంద్, సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి భారీ స్థాయిలో ఓ హిస్టారికల్ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ 33 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ పర్యవేక్షణలో చిత్ర బృందం భారీ, హై ఇంటెన్సిటీ క్లైమాక్స్ సీక్వెన్స్ ని షూటింగ్‌ను ప్రారంభించారు.
'రాత్రిపూట చిత్రీకరించే క్లైమాక్స్ కోసం ప్రత్యేకంగా భారీ సెట్ వేసాం. 25 రోజులు సాగే షెడ్యూల్‌తో సినిమా పూర్తి కానుంది. ఈ సినిమా క్లైమాక్స్ టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా, స్కేల్, ఎగ్జిక్యూషన్ పరంగా ఫస్ట్-ఆఫ్-ఇట్స్-కైండ్‌గా ఉండబోతుంది. ప్రేక్షకులకు మరచిపోలేని అనుభూతిని అందించనుంది. భారత చరిత్రలో వెలుగులోకి రాని ఒక శక్తివంతమైన అధ్యాయాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారు సంకల్ప్ రెడ్డి. గోపీచంద్ ఇప్పటివరకు చేయని పాత్రలో కనిపించబోతున్నారు' అని మేకర్స్ చెబుతున్నారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్, అనుదీప్ దేవ్ సంగీత అందిస్తున్నారు