Gopichand 33: మంచి టైటిల్ పట్టిన గోపీచంద్.. వర్కవుట్ అయితే అదే ఆనందం
ABN , Publish Date - Jul 02 , 2025 | 03:50 PM
మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ఎన్నో ఏళ్లుగా ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.
Gopichand 33: మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ఎన్నో ఏళ్లుగా ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. పట్టువదలని విక్రమార్కుడిలా విజయం కోసం ఇండస్ట్రీపై యుద్ధం చేస్తూనే ఉన్నాడు. మంచి మంచి కథలను ఎంచుకుంటున్నా కూడా ప్రేక్షకులు గోపీచంద్ కు హిట్ ఇవ్వలేకపోతున్నారు. అయినా కూడా ఈ హీరో ఎలాగైనా హిట్ కొట్టాలని స్టార్ డైరెక్టర్లు, బ్యానర్స్ లో వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఇక అందులో భాగంగానే గోపీచంద్.. ఈమధ్యనే ఒక కొత్త సినిమాను ప్రకటించాడు. ఘాజీ, ఐబీ71 సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy) దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్న చిత్రం గోపీచంద్ 33 (Gopichand33).
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఈమధ్యనే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఇక గోపీచంద్ పుట్టినరోజును పురస్కరించుకొని రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఒక యోధుడిగా గోపీచంద్ ఈ సినిమాలో కనిపించనున్నాడని తెలుస్తోంది. 7వ శతాబ్దంలో జరిగిన సంఘటనల ఆధారంగా గోపీచంద్ 33 తెరకెక్కుతోందని సమాచారం. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు శూల అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. శూల అనే ప్రత్యేకమైంది. అదొక ప్రదేశం పేరు. ఈ కథలో ఆ ప్రదేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉండడంతో, కథకు యాప్ట్ గా ఉంటుందని ఆ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. టైటిల్ కూడా కొత్తగా ఉండడంతో ఎక్కువ హైప్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక త్వరలోనే ఈ టైటిల్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. టైటిల్, గోపీచంద్ లుక్ అంతా చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈసారైనా ఈ సినిమా గోపీచంద్ కు వర్క్ అవుట్ అయితే అదే ఆనందమని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
Akkineni Amala: అభిమానులు కాదు రౌడీలు.. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి