సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘గేమ్ ఛేంజర్’లో గ్యాంగ్‌స్టర్ ట్రాక్ లేపేశారు: కార్తీక్ సుబ్బరాజ్ కామెంట్స్ వైరల్

ABN, Publish Date - Oct 28 , 2026 | 07:10 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పొలిటికల్ యాక్షన్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాకు కథను అందించిన కార్తీక్ సుబ్బరాజ్ తాజాగా సంచలన విషయాన్ని బయటపెట్టారు.

Karthik Subbaraj About Game Changer Story Change

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా, లెజెండరీ డైరెక్టర్ శంకర్ (Director Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పొలిటికల్ యాక్షన్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి కోలీవుడ్ విలక్షణ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కథ, చిత్రీకరణ శైలిపై గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) మాట్లాడుతూ.. తాను శంకర్‌కు చెప్పిన అసలు కథ ఏమిటి, సినిమా సెట్స్‌పైకి వెళ్లాక అందులో ఎలాంటి మార్పులు జరిగాయనే విషయాలపై ఓపెన్‌గా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ.. ‘‘నా దగ్గర ఒక మంచి కథ సిద్ధంగా ఉంది, దానిని శంకర్ సార్‌కు వినిపించాను. కథ విన్న తర్వాత శంకర్ సార్ నన్ను స్క్రీన్‌ప్లే కూడా రాసివ్వమని అడిగారు. అయితే ఆ సమయంలో నేను చియాన్ విక్రమ్ నటించిన ‘మహాన్’ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాను. దాంతో పూర్తి స్క్రీన్‌ప్లే రాయడం నాకు సాధ్యపడదని చెప్పి, కేవలం కథను మాత్రమే శంకర్ సార్‌కు అప్పగించాను. నిజానికి నేను రాసిన కథ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దే ఒక ఐఏఎస్ అధికారి చుట్టూ తిరుగుతుంది. అది పూర్తిగా నేల విడిచి సాము చేయకుండా, వాస్తవికతకు దగ్గరగా ఉండే రియలిస్టిక్ డ్రామా. హిందీలో వచ్చిన ‘న్యూటన్’ తరహాలో ఒక ఎన్నికల అధికారి గ్రామానికి వెళ్లినప్పుడు ఎదురయ్యే పరిస్థితులు, దానికి కాస్త యాక్షన్ మేళవించి రాసుకున్న కథ అది’’ అని వివరించారు.


అంతేకాకుండా ఈ కథలో ఒక గ్యాంగ్‌స్టర్ యాంగిల్ కూడా ఉందని కార్తీక్ తెలిపారు. ‘‘తమిళ నేటివిటీలో రాసిన ఈ కథలో మధురైకి చెందిన ఒక గ్యాంగ్‌స్టర్ ఎలిమెంట్ ప్రధానంగా ఉంటుంది. కథానాయకుడు, ఆ గ్యాంగ్‌స్టర్ మధ్య ఉండే బంధం, ఎన్నికల ప్రక్రియ చుట్టూ కథ నడుస్తుంది. అయితే ఎప్పుడైతే రామ్ చరణ్ వంటి స్టార్ హీరో ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారో, శంకర్ సార్ భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్లారో.. అప్పుడు కథ తాలూకు డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి. చివరకు వెండితెరపై చూసినప్పుడు నేను రాసిన దానికి, తెరకెక్కిన దానికి చాలా తేడా కనిపించింది. అయినప్పటికీ నాలాంటి వాడి కథను శంకర్ సార్ లాంటి దిగ్గజ దర్శకుడు తీసుకుని అంత భారీగా డైరెక్ట్ చేశారన్న తృప్తి నాకు ఎప్పుడూ ఉంటుంది’’ అని కార్తీక్ సుబ్బరాజ్ వెల్లడించారు. ‘గేమ్ ఛేంజర్’ అసలు కథపై కార్తీక్ సుబ్బరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి:

‘ఆదర్శకుటుంబం’లో టెన్షన్.. అసలు విషయం ఏంటంటే

‘కిల్లర్’ సినిమా ట్విస్ట్ చెబితే రూ. కోటి.. కాంటెస్ట్ రూల్స్ ఇవే

‘దొంగ నా కొడుకు’ నుంచి ‘ఓ మై గాడ్’ పాటొచ్చింది

Updated Date - Oct 28 , 2026 | 07:10 PM