Karthik subbaraju: ఇళయరాజా గాత్రం దైవ స్వరం

ABN , Publish Date - Sep 08 , 2026 | 10:49 AM

ఇసైజ్ఞాని ఇళయరాజా (Ilaiyaraaja) గాత్రాన్ని తాను దైవస్వరంగా భావిస్తానని ప్రముఖ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ (Karthik Subbaraju) అన్నారు. 

ఇసైజ్ఞాని ఇళయరాజా (Ilaiyaraaja) గాత్రాన్ని తాను దైవస్వరంగా భావిస్తానని ప్రముఖ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ (Karthik Subbaraju) అన్నారు.  తాజాగా  ఆయన  దర్శకత్వం వహించిన చిత్రం ‘డోరత్తి’ (Dorathi) కీర్తి సురేష్‌, సనంద్‌, రిషికాంత్‌ ప్రధాన పాత్రలను పోషించారు. ఇళయరాజా సంగీతం అందించారు. ఈ నెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు మాట్లాడుతూ.. 

‘ఈ కథ చాలా యేళ్లుగా నా మనసులో ఉంది. కరోనా సమయంలో  స్క్రిప్ట్  రాశా. మదురై సమీపంలోని గ్రామానికి చెందిన ఇద్దరు స్నేహితుల చుట్టూ కథ తిరుగుతుంది. వారి జీవితాల్లోకి డోరత్తి అనే పాత్ర ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే  కథ. ఇది 90వ దశకంలో జరిగే కథ. పెద్ద హీరోలు అక్కర్లేదు. సనంద్‌, రిషికాంత్‌ అద్భుతంగా నటించారు. కీర్తిసురేష్‌ డోరత్తి పాత్రలో ఒదిగిపోయారు. ఈ కథకు ఇళయరాజాను సంగీతం సమకూర్చ మని అడిగేందుకు చాలా భయపడ్డా. ఓ రోజున ధైర్యం చేసి.. ‘నేను ఒక సినిమా తీశా. దాన్ని చూసి మీకు నచ్చితే సంగీతం అందించాలని కోరా’. ఈ సినిమా చూసిన ఇళయరాజా.. రేపు ఉదయం 8 గంటలకు రండి. మనం మొదలుపెట్టొచ్చు’ అంటూ సమాచారమిచ్చారు. ఆ తర్వాత 25 రోజుల పాటు ఆయన ఏకధాటిగా ఈ సినిమా కోసం పనిచేశారు. ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. సినిమా రంగంలో ఆయన వంటివారు లేరు. ఇళయరాజా గాత్రాన్ని దైవీక స్వరంగా భావిస్తారు. ఈ మూవీలోని ‘కల్యాణ ధీరే’ పాటను ఆయనే నేపథ్య గానం చేశారు. అదే సినిమాకు అసలైన థ్రిల్‌. ఆ తర్వాత ఆ పాటను ఆల్బంగా  రిలీజ్‌ చేశాం’ అని వివరించారు. 

ALSO READ:
Sardar 2: కమల్‌కు భారతీయుడు.. కార్తీకి సర్దార్‌!

బాలయ్యకి విలన్లుగా మారుతున్న కుర్ర హీరోలు..

సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిన రవి మోహన్- కేనీషా

Updated Date - Sep 08 , 2026 | 11:05 AM