‘కిల్లర్’ సినిమా ట్విస్ట్ చెబితే రూ. కోటి.. కాంటెస్ట్ రూల్స్ ఇవే

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:26 PM

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ లీడ్ రోల్స్ లో నటించిన సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్’. తాజాగా ఈ సినిమా కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్ మీట్‌ను హైదరాబాద్‌లో మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.

Killer 1 Crore Contest

జ్యోతి పూర్వజ్ (Jyoti Poorvaj), పూర్వాజ్ లీడ్ రోల్స్ లో నటించిన సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్’ (Killer Movie). మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, అయినాబత్తిన దశరథ మాధవ్, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ (Poorvaaj) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా అక్టోబర్ 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ రాబోతోంది. ఓవర్సీస్‌లో ‘కిల్లర్’ మూవీని ఓఎంజి పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. బుధవారం ఈ సినిమా కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్ మీట్‌ను హైదరాబాద్‌లో మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కాంటెస్ట్ వివరాలను ఈ కార్యక్రమంలో తెలిపారు.


ఈ సందర్భంగా డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్ మాట్లాడుతూ.. మేము మా సినిమాకు కోటి రూపాయల కాంటెస్ట్ అనౌన్స్ చేయగానే అది ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది. చిత్ర సక్సెస్ మీట్‌లో విజేతను ప్రకటిస్తామని చెప్పాం. అయితే కొందరు మాత్రం సోషల్ మీడియాలో మీ సినిమా సక్సెస్ అయితే కదా.., ఆ కోటి రూపాయలన్నా కలెక్షన్స్ వస్తాయా? అని పోస్ట్‌లు చేస్తున్నారు. మా ప్రమోషనల్ కంటెంట్ ఎగ్జైట్ చేస్తే వచ్చి సినిమా చూడమని అంటున్నాం. మా సినిమాలోని ట్విస్ట్ చెబితే కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించాం. అది సినిమా ప్రమోషన్స్ కోసం చెప్పలేదు.. హైకోర్టు లాయర్‌తో కొన్ని నిబంధనలతో అగ్రిమెంట్ రాయించి మరీ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాం. మా మూవీ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. ఈ నెల 29న 10 గంటలకు మూవీ ప్రీమియర్స్ ఉంటాయి.


సినిమా సెకండాఫ్‌లో వచ్చే మేజర్ ట్విస్ట్ ఏదైతో ఉందో, ఆ ట్విస్ట్ అలా అవడానికి ఒక మేజర్ రీజన్ ఉంటుంది. ఇంటర్వెల్ ఇచ్చిన 5 నిమిషాల్లో జస్ట్ వన్ లైన్ ఆన్సర్ మా వాట్సాప్ నెంబర్ 7330608675కు పంపాలి. షో చూస్తున్న టికెట్ ఫొటో పెట్టి ఆన్సర్ రాయాలి. ఆ ఐదు నిమిషాల్లో వచ్చిన మెసేజ్‌లు అన్నీ.. ఈ మెబైల్‌లో రికార్డ్ అయ్యి ఉంటాయి. మీరు పంపే సమధానం మా ఆన్సర్‌తో మ్యాచ్ కావాలి. మా ఆన్సర్ కూడా.. డేట్‌తో వీడియో రికార్డ్ చేసి పెట్టాం. సక్సెస్ మీట్‌లో ఆ విజేతను ప్రకటిస్తాం. తక్కువ టైమ్‌లో ఆన్సర్ పంపిన వారికి బహుమతి ఉంటుంది. మా సినిమా కచ్చితంగా సక్సెస్ అయి తీరుతుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

‘దొంగ నా కొడుకు’ నుంచి ‘ఓ మై గాడ్’ పాటొచ్చింది

సయామీ ఖేర్ ఇంటర్నేషనల్ ఎంట్రీ.. ఇండో-రష్యన్ ప్రాజెక్ట్‌లో క్రేజీ రోల్

ఇంకొన్ని గంటల్లో ఓటీటీకి ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’.. వివరాలివే

Updated Date - Oct 28 , 2026 | 06:26 PM

Killer First Look: కిల్లర్‌ లుక్‌

Killer: ఇండియాలో ఫస్ట్ సూపర్ షీ మూవీ

Killer: ‘కిల్లర్’లో జ్యోతి పూర్వజ్ లుక్ చూశారా..

‘కిల్లర్’ సెకండాఫ్ ట్విస్ట్ చెప్పండి.. రూ. కోటి గెలుచుకోండి: దర్శకుడు పూర్వాజ్

'కిల్లర్' మేకర్స్ సూపర్ షీ ఛాలెంజ్‌!