‘దొంగ నా కొడుకు’ నుంచి ‘ఓ మై గాడ్’ పాటొచ్చింది

ABN , Publish Date - Oct 28 , 2026 | 05:26 PM

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న చిత్రాలను కూడా నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ బ్యానర్‌‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.

Donga Naa Koduku Team

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న చిత్రాలను కూడా నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ బ్యానర్‌‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’ (Donga Naa Koduku). మౌళి తనూజ్ ప్రశాంత్ (Mouli Tanuj Prashanth) హీరోగా నటిస్తోన్న ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసి.. తాజాగా ఫస్ట్ సింగిల్ ‘ఓ మై గాడ్’ (Oh My God Lyrical Song)ను విడుదల చేశారు.


‘ఓ మై గాడ్’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్‌ను సింజిత్ ఎర్రమిల్లి స్వరపరిచారు. ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన హీరో మనసులోని భావాలను రచయిత భాస్కరభట్ల అందంగా అక్షరాల్లోకి తీసుకొచ్చారు. తన సింగిల్ లైఫ్‌ను ప్రేయసి ఎలా మార్చేసిందో, ఆమెతో గడిపే ప్రతి క్షణం తనకు ఎంత విలువైనదో హీరో ఈ పాటలో వ్యక్తం చేస్తాడు. ప్రేమలోని ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఈ పాట చక్కగా ఆవిష్కరిస్తోంది. రామ్ మిరియాల తనదైన ఎనర్జీ, వాయిస్‌తో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. ఆయన డైనమిక్ వోకల్స్ ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలవగా.. ఆట సందీప్ కొరియోగ్రఫీ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. మౌళి తనూజ్ ప్రశాంత్ తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకోగా, సుష్మిత శెట్టితో ఆయన కెమిస్ట్రీ క్యూట్‌గా ఉంది. యూత్‌ఫుల్ రొమాంటిక్ వైబ్‌తో సాగిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ఊపేస్తోంది.


ఇక ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మౌళి మాట్లాడుతూ.. ‘‘సందీప్ మాస్టర్‌కు థ్యాంక్స్. నన్ను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చి ఈ సాంగ్‌లో డ్యాన్స్ చేయించారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. భాస్కర భట్ల సార్ అద్భుతంగా లిరిక్స్ రాశారు. అందరికీ అర్థమయ్యేలా, యూత్‌కు కనెక్ట్ అయ్యేలా రాశారు. అలాగే రామ్ మిరియాల నా ఫేవరెట్ సింగర్. ఆయన నా సినిమాకు పాట పాడడం అదృష్టంగా భావిస్తున్నాను. సింజిత్ తన మ్యూజిక్‌తో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తాడు. తను నాకు ఫ్రెండ్ కావడం చాలా హ్యాపీ. నా కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చాను. యూట్యూబ్‌లో స్టార్ట్ చేశాను. తర్వాత ‘లిటిల్ హార్ట్స్‌’తో యాక్టర్‌గా కూడా విజయం వచ్చింది. ఈ సినిమాకు యాక్టింగ్‌తో పాటు ప్రొడక్షన్ కూడా హ్యాండిల్ చేశాను. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి చాలా విషయాలు నేర్చుకున్నాను. కంఫర్ట్ జోన్ దాటి బయటకు వస్తే కచ్చితంగా విజయం వస్తుందని నమ్ముతున్నాను. నవంబర్ 13న థియేటర్లలో అంతా హాయిగా నవ్వుకోవచ్చు. అందరూ థియేటర్స్‌కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

సయామీ ఖేర్ ఇంటర్నేషనల్ ఎంట్రీ.. ఇండో-రష్యన్ ప్రాజెక్ట్‌లో క్రేజీ రోల్

ఇంకొన్ని గంటల్లో ఓటీటీకి ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’.. వివరాలివే

‘ఫౌజీ’ గ్లింప్స్‌పై నేతాజీ మనవడి ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

Updated Date - Oct 28 , 2026 | 05:26 PM

నవ్వుల రాబరీ మొదలైంది.. హిలేరియస్‌గా ‘దొంగ నా కొడుకు’ టీజర్

మౌళి ఎవడు కామెంట్స్ పై స్పందించిన హీరో.. నన్ను బెదిరించారు

యన్టీఆర్‌-త్రివిక్రమ్ పౌరాణిక చిత్రంపై క్రేజీ అప్డేట్

Karikala: ముగ్గురు కథానాయికలతో.. సందీప్ కిషన్ ‘కరికాల’ ఆరంభం

కొత్త పాట‌తో.. గ‌త్త‌ర లేపుతున్న 'ఇడుపు కాయితం'