Karthik subbaraju: కార్తిక్‌ సుబ్బరాజ్‌కు రజనీకాంత్‌ ప్రశంసలు

ABN , Publish Date - Oct 11 , 2026 | 01:03 PM

‘డోరతి’ విజయం ఇసైజ్ఞాని ఇళయరాజాకు అంకితం చేస్తున్నట్టు ఆ చిత్ర దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌ అన్నారు.

‘డోరతి’ విజయం ఇసైజ్ఞాని ఇళయరాజాకు అంకితం చేస్తున్నట్టు ఆ చిత్ర దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌ అన్నారు. కీర్తిసురేష్‌, రిషికాంత్‌, సనంద్‌ కుమార్‌ ప్రధాన పాత్రలను పోషించిన ఈ చిత్రాన్ని జ్యోతి దేశ్‌పాండే, గునీత్‌ మోంగా కపూర్‌, అచిన్‌ జైన్‌తో కలిసి కార్తిక్‌ సుబ్బరాజ్‌ నిర్మించారు. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఇటీవల విజయోత్సవాలను నిర్వహించారు. ఆ సమయంలో ఇళయరాజా ఆస్ట్రేలియా పర్యటన లో ఉండటంతో హాజరుకాలేదు. 

ఈ నేపథ్యంలో ఆయన శనివారం నగరానికి తిరిగి రాగా, దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌ కలుసుకుని అభినందనలు తెలిపారు. ఈ సందర్భం గా ఇళయరాజాకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ చిత్ర విజయానికి మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా ముఖ్య కారణమని, అందుకే ఈ చిత్రం విజయాన్ని ఆయనకు అంకితం చేస్తున్నట్టు తెలిపారు. మరోవైపు, ‘డోరతి’ చిత్రాన్ని చూసిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చిత్ర బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. ముఖ్యంగా చిత్ర దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌కు ఫోన్‌ చేసి అభినందించారు.

ALSO READ:
Raviteja: రవితేజ 'తులాభారం' మొదలైంది

Kaaka: ‘కాకా’ షూటింగ్‌పై కీలక అప్డేట్‌..

రణబాలి ఓవర్సీస్‌.. ఇతర భాషల్లో వెనక్కి వెళ్లినట్టేనా

Aditi Rao Hydari: గ్లామర్‌ ప్రపంచంలోనూ నాలోని చిన్నారిని కాపాడుకుంటున్నా..

Updated Date - Oct 11 , 2026 | 01:39 PM