‘ఆదర్శకుటుంబం’లో టెన్షన్.. అసలు విషయం ఏంటంటే
ABN , Publish Date - Oct 28 , 2026 | 06:45 PM
అక్టోబర్ సెంటిమెంట్‌తో ‘ఆదర్శకుటుంబం’ వచ్చేస్తోంది. మరోవైపు, ఏపీలో అర్నాబ్ తుఫాన్ అడ్డుకట్ట వేస్తుందనే టెన్షన్ మొదలైంది. అయితే మరో సెంటిమెంట్ ఊరట కలిగిస్తోంది.
అక్టోబర్ సెంటిమెంట్‌తో ‘ఆదర్శకుటుంబం’ వచ్చేస్తోంది. మరోవైపు, ఏపీలో అర్నాబ్ తుఫాన్ అడ్డుకట్ట వేస్తుందనే టెన్షన్ మొదలైంది. అయితే మరో సెంటిమెంట్ ఊరట కలిగిస్తోంది. ఇంకో సెంటిమెంట్ ఆసక్తి రేపుతోంది.. ఇంతకూ ‘ఆదర్శకుటుంబం’ చుట్టూ అల్లుకున్న ఆ ముచ్చట్లలోకి వెళితే..
విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘ఆదర్శకుటుంబం హౌస్ నెంబర్ 47’ (Aadarsha Kutumbam House No: 47) సినిమా అక్టోబర్ 30న జనం ముందు నిలవనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ‘ఆదర్శకుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళావేదికలో అంగరంగవైభవంగా జరిగింది. టీమ్ అందరిలోనూ సినిమాపై ఎన్నో హోప్స్ ఉన్నట్టు వారి మాటల్లోనే తెలిసిపోతోంది. అయితే అనుకోకుండా అర్నాబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌లో కోనసీమను అల్లకల్లోలం చేస్తోంది. ఈ ఎఫెక్ట్ ‘ఆదర్శకుటుంబం’పై పడుతుందేమో అని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ విషయంలో టీమ్ కూడా టెన్షన్‌లో ఉందని తెలుస్తోంది. వెంకటేశ్‌కు అక్టోబర్‌లో పలు విజయాలు ఉన్నాయి. అందువల్ల ‘ఆదర్శకుటుంబం’ కూడా అదే తీరున సక్సెస్ రూటులో సాగిపోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఇలాంటి తుఫాన్లు వచ్చిన సమయంలోనూ కొన్ని సినిమాలు ఘనవిజయం సాధించిన అంశాన్ని సినీ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. 1970ల చివరలో దివిసీమ ఉప్పెన వచ్చినా, అప్పట్లో ‘యమగోల’ లాంటి సినిమాలు గ్రాండ్ సక్సెస్ సాధించాయి. 1990లో ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ సైతం తుఫాన్‌లోనే ఘనవిజయం సాధించింది. ఈ తీరున అర్నాబ్ తుఫాన్ లోనూ ‘ఆదర్శకుటుంబం’కు కలసి వస్తుందని అంటున్నారు.
ఈ మధ్య కాలంలో టిక్కెట్ రేట్లు పెంచిన సినిమాలేవీ అంతగా అలరించడం లేదు. ‘ఆదర్శకుటుంబం’ చిత్రానికి కూడా టిక్కెట్ రేట్స్ హైక్ చేసుకోవచ్చునని ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. దాంతో ‘ఆదర్శ కుటుంబం’ రిజల్ట్ ఏమవుతుందో అన్న అనుమానాలు కొందరిలో పొడసూపుతున్నాయి. అయితే వెంకటేశ్‌కు అచ్చివచ్చిన అక్టోబర్ సెంటిమెంట్, తుఫానులను సైతం వెనక్కి నెట్టిన కొన్ని చిత్రాల విజయాలు ‘ఆదర్శ కుటుంబం’ బృందంలో ఆశలు రేపుతున్నాయి. ఈ కోణంలో టిక్కెట్ రేట్స్ పెంచుకుంటే అంతగా ఆడవనే అంశాన్నీ ‘ఆదర్శకుటుంబం’ తుడిచిపారేస్తుందని సినిమా యూనిట్ భావిస్తోంది.
వెంకటేశ్- త్రివిక్రమ్ కాంబో గతంలో సక్సెస్ రూటులోనే సాగింది. వెంకటేశ్ హీరోగా నటించిన ‘పవిత్రబంధం’ చిత్రానికి త్రివిక్రమ్ రచనా విభాగంలో అసిస్టెంట్‌గా పనిచేశారు. తరువాతి రోజుల్లో వెంకటేశ్ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ సినిమాలకు రచయితగానే సాగారు. ఈ సినిమాలన్నీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఆదర్శకుటుంబం’ కూడా గ్రాండ్ సక్సెస్ సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇలా పలు పాజిటివ్ వైబ్స్‌తోనే వస్తోన్న ‘ఆదర్శకుటుంబం’ అన్ని బ్యాడ్ సెంటిమెంట్స్‌ను తుడిచేస్తుందని భావిస్తున్నారు. ఫైనల్‌గా అక్టోబర్ 30న ‘ఆదర్శ కుటుంబం’ ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
‘కిల్లర్’ సినిమా ట్విస్ట్ చెబితే రూ. కోటి.. కాంటెస్ట్ రూల్స్ ఇవే
‘దొంగ నా కొడుకు’ నుంచి ‘ఓ మై గాడ్’ పాటొచ్చింది
సయామీ ఖేర్ ఇంటర్నేషనల్ ఎంట్రీ.. ఇండో-రష్యన్ ప్రాజెక్ట్‌లో క్రేజీ రోల్