సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అవసరమే కానీ.. పెళ్లిపై ఫరియా అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్!

ABN, Publish Date - May 10 , 2026 | 04:05 PM

సినిమాల్లోకి రాకపోయి ఉంటే.. ఓ పెద్ద క్రూయిజ్‌లో షెఫ్‌ లేదా ఈవెంట్‌ మేనేజర్‌ అయ్యేదానిని. అలానే ట్రావెల్‌ వ్లాగర్‌గా కూడా ప్రయత్నించేదానినని చెబుతోంది పొడుగు కాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా. ఇంకా పెళ్లిపై ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Faria Abdullah

‘జాతిరత్నాలు’లో చిట్టీగా ప్రేక్షకుల మనసు దోచేసిన ఆరడుగుల సొగసరి ఆమె. ఆ తర్వాత వరుస సినిమాలు చేసి, తెరపై చలాకీతనం ఉట్టిపడే పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. విభిన్నమైన పాత్రలతో సందడి చేస్తూ... టాలీవుడ్‌లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న ఫరియా అబ్దుల్లా (Faria Abdullah).. తాజాగా పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘సినిమాల్లోకి రాకపోయి ఉంటే.. ఓ పెద్ద క్రూయిజ్‌లో షెఫ్‌ లేదా ఈవెంట్‌ మేనేజర్‌ అయ్యేదాన్ని. అలానే ట్రావెల్‌ వ్లాగర్‌గా కూడా ప్రయత్నించేదాన్ని కావచ్చు’ అని తెలిపిన ఈ భామ పెళ్లి, ప్రేమల గురించి చెప్పిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. ‘‘నా దృష్టిలో ప్రేమ (Love), పెళ్లి (Marriage) అనేవి వేరు వేరు అంశాలు. ప్రేమంటే ఒక అద్భుతమైన అనుభూతి. మనల్ని ఒకరు ప్రేమిస్తున్నారు అనే భావనే అద్భుతంగా ఉంటుంది. జీవితానికి ఒక తోడు కచ్చితంగా అవసరమే. వివాహబంధం అనేది ఒక మనిషి తనను తాను పూర్తిగా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుత జనరేషన్‌ పెళ్లిపై ఆసక్తి కోల్పోతోంది. భవిష్యత్తులో వివాహానికి అర్థమే మారిపోవచ్చు’’ అని వెల్లడించారు.


సోషల్‌ మీడియా గురించి మాట్లాడుతూ.. ‘‘సోషల్ మీడియాను వాడడం మంచిదే. కానీ అది శ్రుతిమించని స్థాయిలో.. హద్దుల్లో ఉంటే ఇబ్బంది లేదు. గాసిప్స్‌, రూమర్స్‌ ఇలాంటివన్నీ సహజంగానే వస్తుంటాయి. వాటిని ఎక్కువగా పట్టించుకోకూడదు. కెరీర్‌పై ఫోకస్‌ చేసుకుంటూ మన పని మనం చేసుకోవాలి’’ అని చెప్పారు. నటిగా తనకు సూటయ్యే అన్ని రకాల పాత్రల్లోనూ నటించాలనుందని, కొత్త కొత్త జానర్‌ చిత్రాల్లో భాగం కావాలని అనుకుంటున్నట్లుగా తెలిపిన ఈ భామ.. సినిమాలో తన క్యారెక్టర్‌ డిజైన్‌ బాగుంటే చిన్న రోల్‌ చేయడానికి కూడా సిద్ధమేనని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

‘అండర్‌ రేటెడ్‌’ నటిగా చూస్తున్నారా? పాయల్ రాజ్‌ఫుత్‌ సమాధానమిదే!

Raghava Theater: ఈ థియేటర్‌లో ఫస్ట్, లాస్ట్ సినిమా ఎన్టీఆర్‌దే.. భావోద్వేగంలో ఫ్యాన్స్!

త్రిష లేకుంటే విజయ్ జాతకం మరోలా ఉండేది- వేణు స్వామి

Ranabaali: హార్స్ రైడింగ్ గ్లింప్స్.. విజయ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్!

Updated Date - May 10 , 2026 | 04:05 PM