Faria Abdullah: నేను ప్రేమించే వ్యక్తి .. హిందువు

ABN , Publish Date - Jan 23 , 2026 | 10:03 AM

ఇటీవ‌ల గుర్రం పాపిరెడ్డి సినిమాతో అల‌రించిన హైద‌రాబాదీ బ్యూటీ, 'జాతిరత్నాలు' చిట్టి ఫ‌రియా అబ్దుల్లా స‌డ‌న్‌గా ఓ బాంబు పేల్చింది.

Faria Abdullah

ఇటీవ‌ల గుర్రం పాపిరెడ్డి (Gurram Paapi Reddy) సినిమాతో అల‌రించిన హైద‌రాబాదీ బ్యూటీ, 'జాతిరత్నాలు' చిట్టి ఫ‌రియా అబ్దుల్లా (Faria Abdullah) స‌డ‌న్‌గా ఓ బాంబు పేల్చింది. తాను ప్ర‌స్తుతం ఓ వ్య‌క్తితో ల‌వ్‌లో ఉన్న‌ట్లు ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

fariaabdullahinterview.jpg

'నేను ప్రేమించే వ్యక్తి ముస్లిం కాదు హిందువే. అతను కొరి యోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. ఈ మధ్య నేను చేస్తున్న సినిమాల్లో నా డ్యాన్స్ ఇంప్రూవ్ కావడానికి ముఖ్య కారణం ఆయనే. మా ఇద్దరి మధ్య ఉన్న బందం ఎంతో ప్రత్యేకమైంది. ఇద్దరం కలసి ఓ టీమ్‌గా ముందుకెళ్తున్నాం.

Faria Abdullah

ఆయన ప్రోత్సాహంతో నా వ్యక్తిగత జీవితాన్ని, వర్క్ లైఫ్‌ను సునాయాసంగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను' అని చెప్పింది. ఇప్పుడు ఈ వార్త సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతుండ‌గా ఆ అంద‌గాడెవ‌రో చూపించొచ్చు క‌దా! అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Faria Abdullah

Updated Date - Jan 23 , 2026 | 03:14 PM