Tharun Bhascker: ఈషా రెబ్బతో పెళ్లి.. తరుణ్ భాస్కర్ ఏమన్నాడంటే

ABN , Publish Date - Jan 27 , 2026 | 04:10 PM

డైరెక్టర్ కమ్ నటుడు తరుణ్ భాస్కర్ (harun Bhascker) హీరోగా తెరకెక్కిన చిత్రం ఓం శాంతి శాంతి శాంతిః (Om Shanti Shanti Shantihi). ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఈషా రెబ్బ (Eesha Rebba)హీరోయిన్ గా నటించింది.

Tharun Bhascker

Tharun Bhascker: డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్ తరుణ్ భాస్కర్ (harun Bhascker) హీరోగా తెరకెక్కిన చిత్రం ఓం శాంతి శాంతి శాంతిః (Om Shanti Shanti Shantihi). ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఈషా రెబ్బ (Eesha Rebba)హీరోయిన్ గా నటించింది. మలయాళంలో జయ జయ జయ జయహే సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 30 న రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్రబృందం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో తరుణ్ భాస్కర్.. హీరోయిన్ ఈషా రెబ్బతో ఉన్న రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చాడు. గత కొన్ని రోజులుగా తరుణ్ - ఈషా మధ్య ప్రేమాయణం కొనసాగుతోందని, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలపై తరుణ్ స్పందించాడు. ఈషా తనకు ఫ్రెండ్ కన్నా ఎక్కువ అని, తనకున్న బెస్ట్ ఫ్రెండ్స్ లో ఈషా కూడా ఒకరు అని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా చెప్పాల్సిన టైమ్ లో చెప్పాల్సిన విషయం చెప్తానని తెలిపాడు.

'ఈ వార్తలు అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి ఒక మంచి సమయం కోసం ఎదురుచూస్తున్నాను. ఫ్రెండ్ కంటే ఎక్కువ ఈషా నాకు. బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరు. రెండేళ్లుగా అన్నీ తానే అయ్యింది. ఇందులో చెప్పడానికి కానీ, దాచడానికి కానీ ఏమి లేదు. కానీ, అది చెప్పడానికి కూడా ఒక మంచి టైమ్ కావాలి అని చూస్తున్నాను. పర్సనల్ విషయం కాబట్టి నేను ఏదైనా చెప్తే అది వేరేవాళ్లను ఎఫెక్ట్ చేసే ఆస్కారం కూడా ఉంది కాబట్టి అడుగువేయడానికి ఆలోచిస్తున్నాను. కానీ, ఈ వార్తలకు ఎండ్ కార్డు అయితే పడుతుందని అనుకుంటున్నాను' అని చెప్పాడు. అంటే ఈ పెళ్లి వార్తలు నిజమే అని, త్వరలోనే ఒక మంచి సమయం చూసుకొని వీరిద్దరూ తమ పెళ్లి గురించి చెప్పాలనుకుంటున్నట్లు తరుణ్ మాటల్లో తెలుస్తోంది. మరి ఈ విషయమై ఈషా ఎలా స్పందిస్తుందో చూడాలి.

Updated Date - Jan 27 , 2026 | 05:08 PM