Tharun Bhascker: తరుణ్ భాస్కర్ కొత్త సినిమా, ఈషా రెబ్బా కథానాయిక

ABN , Publish Date - Apr 10 , 2024 | 04:41 PM

తరుణ్ భాస్కర్ కొత్త సినిమా ఒకటి వచ్చే వారం చిత్రీకరణ జరుపుకోనుంది అని తెలిసింది. ఇందులో ఈషా రెబ్బ కథానాయికగా నటిస్తోందని, ప్రముఖ క్యారెక్టర్ నటుడు బ్రహ్మాజీ ఒక ముఖ్య పాత్రలో కనపడనున్నారని తెలిసింది. అయితే తరుణ్ భాస్కర్ ఈ సినిమాకి దర్శకుడా?లేక నటుడిగా చేస్తున్నారా? చదవండి

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ కొత్త సినిమా, ఈషా రెబ్బా కథానాయిక
Tharun Bhascker and Eesha Rebba

తరుణ్ భాస్కర్ దర్శకుడిగా ఆమధ్య 'కీడా కోలా' అనే సినిమా చేసాడు, థియేటర్స్ లో విడుదలైంది, సినిమా పరవాలేదు, నిర్మాతకి లాభాలు వచ్చాయి అన్నారు. అలాగే దర్శకుడిగా కాకుండా నటుడిగా కూడా తరుణ్ భాస్కర్ బాగానే బిజీగా ఉంటున్నాడు. అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్ చేసుకుంటూ నటుడిగా కూడా బాగా రాణిస్తున్నాడు తరుణ్ భాస్కర్. ఇప్పుడు తరుణ్ భాస్కర్ కొత్త సినిమా ఒకటి ప్రారంభం కానుంది అని తెలిసింది. ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ దర్శకుడు మాత్రం కాదట, తరుణ్ భాస్కర్ కథానాయకుడిగా నటిస్తున్నాడు అని తెలిసింది.

eesharebbanew.jpg

తరుణ్ భాస్కర్ పక్కన ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తోందని తెలిసింది. వీరిద్దరూ జంటగా వచ్చే వారం ఒక సినిమా ప్రారంభం కానుంది అని, దీనికి సంజీవ్ దర్శకత్వం వహిస్తున్నారని తెలిసింది. ఇంతకు ముందు 'తిమ్మరుసు', 'పంచతంత్రం', 'అద్భుతం' సినిమాల నిర్మాణంలో భాగస్వామిగా వున్న సృజన్ యరబోలు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తారని తెలిసింది.

brahmaji5.jpg

ఇందులో ప్రముఖ క్యారెక్టర్ నటుడు బ్రహ్మాజీ ఒక ముఖ్య పాత్రలో కనపడతారని తెలిసింది. బ్రహ్మాజీ ప్రస్తుతం 'పుష్ప 2' సినిమా చిత్రీకరణలో వున్నారని, అతను 'పుష్ప 2' అయిన తరువాత రాజమండ్రిలో ఈ తరుణ్ భాస్కర్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారని తెలిసింది.

tharunbhascker1.jpg

ఈషా రెబ్బా ఈమధ్య చాలా వెబ్ సిరీస్ లలో కనిపించారు, అలాగే సినిమాలు కూడా చేస్తున్నారు. ఆమధ్య విడుదలైన 'దయా' అనే వెబ్ సిరీస్ లో ఒక మంచి పాత్ర చేసి ప్రేక్షకుల, విమర్శకుల ప్రసంశలు పొందారు. ఈషా మంచి ప్రతిభగల నటి, అందుకనే ఈ సినిమాలో ఆమెని కథానాయకురాలిగా తీసుకున్నట్టు తెలిసింది. ఈ సినిమా చిత్రీకరణ రాజమండ్రిలో వచ్చేవారం ప్రారంభం కానుంది అని కూడా తెలిసింది. ఈ సినిమా కథ చాలా బాగుంటుందని, గ్రామీణ వాతావరణ నేపథ్యంలో కూడా ఉంటుందని తెలిసింది. అందుకే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చెయ్యాలని చిత్ర నిర్వాహకులు భావిస్తున్నారని తెలిసింది.

Updated Date - Apr 10 , 2024 | 04:42 PM