Dimple Hayathi: ‘భోగి’లో మందారంగా డింపుల్.. చల్ తీ!
ABN , Publish Date - May 11 , 2026 | 10:49 PM
చార్మింగ్ స్టార్ శర్వా, మాస్ మేవరిక్ సంపత్ నంది కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న భారీ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ చిత్రం ‘భోగి’. ఈ సినిమా నుంచి డింపుల్ హయాతి లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు.
చార్మింగ్ స్టార్ శర్వా (Charming Star Sharwa), మాస్ మేవరిక్ సంపత్ నంది (Sampath Nandi) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న భారీ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ చిత్రం ‘భోగి’ (Bhogi). శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మాణంలో, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. శర్వా కెరీర్‌లోనే అత్యంత భారీ స్థాయి వెంచర్‌లలో ఒకటిగా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి వస్తోన్న ఒక్కో అప్డేట్.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి డింపుల్ హయాతి (Dimple Hayathi) పాత్ర లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ లుక్ ప్రస్తుతం వైరల్ అవడమే కాకుండా, సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తోంది.
డింపుల్ హయాతి ఈ చిత్రంలో ‘మందారం’ అనే పాత్రలో కనిపించనుందని తెలుపుతూ వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో.. ఆమె ఎర్ర చీరలో బోల్డ్ అండ్ స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. చేతిలో విసనకర్ర పట్టుకుని, ఇంటెన్స్ హావభావాలతో కనిపిస్తున్న ఆమె లుక్.. 1960ల కాలాన్ని ప్రతిబింబించేలా ఉంది. పోస్టర్‌లో కనిపించిన వింటేజ్ బ్రాస్ బాక్స్, గ్రామీణ వాతావరణం ఆమె పాత్రకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. ఆమె చూపుల్లోనే ఒక తిరుగుబాటు స్వభావం కనిపిస్తోంది. ఈ లుక్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసిన మేకర్స్.. “ప్రపంచం కోరుకున్న సౌందర్యం.. ప్రపంచం ఎన్నడూ అర్థం చేసుకోని ఆత్మ, నిర్భయమైన సంకల్పంతో ముందుకు సాగే శక్తి అయిన ‘మందారం’ను పరిచయం చేస్తున్నాం” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రపంచం గురించి ఏమాత్రం పట్టించుకోని ధైర్యవంతమైన పాత్రలో ఆమె ఇందులో కనిపించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.
ఇక షూటింగ్ విషయానికి వస్తే.. ఇటీవల చిత్ర యూనిట్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించింది. హైదరాబాద్‌లో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో 1960ల కాలాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్ నిర్మించి అందులో షూటింగ్ నిర్వహిస్తున్నారు. సినిమా స్కేల్, యాక్షన్ ఇంటెన్సిటీపై మేకర్స్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆమె లుక్ కూడా మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 2026 ఆగస్ట్ 28న రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
పవన్ కళ్యాణ్, విజయ్‌ల విజయ రహస్యం అదే: ఆర్జే బాలాజీ
అందుకే తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ చేయడం లేదు- బోయపాటి శ్రీను
Peddi Movie: ‘పెద్ది’ ట్రైలర్‌కు డేట్ ఫిక్సయింది.. బుచ్చిబాబు ప్లాన్ ఇదే!
తన తొలి సినిమా హీరో విజయ్ పై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్!