Bhogi: భీమ్స్ ను తప్పించారా... తప్పుకున్నాడా...
ABN , Publish Date - May 01 , 2025 | 11:45 AM
దర్శకుడు సంపత్ నంది, భీమ్స్ సిసిరోలియో మధ్య అనుబంధం ఈనాటిది కాదు. అయితే సంపత్ నంది తాజా చిత్రం 'భోగి' నుండి భీమ్స్ తప్పుకున్నట్టు తెలుస్తోంది!
ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand), దర్శకుడు సంపత్ నంది (Sampath Nandi) కాంబోతో తెరకెక్కుతున్న సినిమా 'భోగి' (Bhogi). శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె. కె. రాధామోహన్ (K.K. Radha Mohan) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బుధవారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. చిత్రం ఏమంటే... ఈ సినిమాకు కెమెరామ్యాన్ ఎవరు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. గతంలో దీనికి సౌందర్ రాజన్ ఎస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. కానీ తాజాగా మీడియాకు పంపిన సమాచారంలో సినిమాటోగ్రాఫర్ ను త్వరలోనే ఫైనలైజ్ చేస్తున్నట్టుగా ఉంది. చిత్రం ఏమంటే... ఇది కేవలం సినిమాటోగ్రాఫర్ విషయంలోనే కాదు... సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) విషయంలోనూ జరిగింది. ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసినప్పుడు భీమ్స్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చుతున్నట్టు మేకర్స్ తెలిపారు. కాగా... తాజా ప్రెస్ నోట్ లో సినిమాటోగ్రాఫర్ తో పాటు భీమ్స్ పేరునూ తొలగించారు. ఈ రెండు విభాగాలకు సంబంధించి ఎవరు పనిచేస్తారనేది త్వరలో తెలియచేస్తామని అన్నారు.
నిజానికి తెలుగు సినిమా రంగంలో భీమ్స్ కు కెరీర్ ప్రారంభంలో దర్శకుడు సంపత్ నంది దన్నుగా నిలిచాడు. అతనితో పలు చిత్రాలకు వర్క్ చేయించాడు. అవకాశాలను అందించాడు. బేసికల్ గా మంచి ప్రతిభావంతుడైన భీమ్స్ సైతం నిదానంగా చొచ్చుకుని పోయే గుణాన్ని పెంపొందించుకుని, వరుస అవకాశాలతో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ భీమ్స్ ను తీసుకెళ్ళి ఎక్కడో నెలబెట్టింది. దాంతో చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమాకు కూడా అతనే సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సంపత్ నంది - శర్వానంద్ మూవీ నుండి భీమ్స్ పేరు వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. సమయాభవం వల్ల భీమ్స్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడా? లేక మేకర్స్ భీమ్స్ ను తప్పించారా? అనేది తెలియకుండా ఉంది. మరి ఈ విషయంలో వీరిలో ఎవరో ఒకరు వివరణ ఇస్తే తప్పితే క్లారిటీ రాదు!
Also Read: Hit - The Third Case: హిట్ -3 మూవీ రివ్యూ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి