Dimple Hayathi: కొంటె పనులు చాలా చేశాను

ABN , First Publish Date - 2023-05-07T10:22:02+05:30 IST

పేరు చూసి ఉత్తరాది అమ్మాయనుకుంటారు. కానీ పక్కా హైదరాబాదీ. ‘సూపర్‌ హిట్‌.. నీ హైట్‌’ అంటూ మూడు నిమిషాలే ఆడిపాడినా.. తన గ్రేస్‌ఫుల్‌ స్టెప్పులతో కుర్రాళ్లకు ఫుల్‌ కిక్కెక్కించింది. తాజాగా తన గురించి డింపుల్ ఏం చెప్పిందంటే..

Dimple Hayathi: కొంటె పనులు చాలా చేశాను
Heroine Dimple Hayathi

డింపుల్‌ హయాతి (Dimple Hayathi).. పేరు చూసి ఉత్తరాది అమ్మాయనుకుంటారు. కానీ పక్కా హైదరాబాదీ. ‘సూపర్‌ హిట్‌.. నీ హైట్‌’ అంటూ మూడు నిమిషాలే ఆడిపాడినా.. తన గ్రేస్‌ఫుల్‌ స్టెప్పులతో కుర్రాళ్లకు ఫుల్‌ కిక్కెక్కించింది. ‘ఖిలాడి’ (Khiladi)తో ఇండస్ట్రీ చూపును తనవైపునకు తిప్పుకుని టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా మారిందీ భామ. ఇప్పుడు ‘రామబాణం’ (Rama Banam)తో మరోసారి ప్రేక్షకులను పలకరించిన సందర్భంగా ఆమె పంచుకున్న విశేషాలివి..

తాయత్తు కట్టించారు

నేను విజయవాడ (Vijayawada)లో పుట్టినా, పెరిగిందంతా హైదరాబాద్‌లోని తాతయ్య వాళ్ల ఇంట్లో. అమ్మ, నాన్న వ్యాపారాలు చూసుకుంటుంటారు. ‘నువ్వు పెద్దయ్యాక ఏమవుతావ’ని చిన్నప్పుడు టీచర్లు అడిగితే.. ‘హీరోయిన్‌ అవుతా’ (Heroine) నని ధైర్యంగా చెప్పేదాన్ని. నాకు సినిమాలంటే అంత పిచ్చి మరి. ఏదైనా సినిమా చూస్తే చాలు.. నాలో నేనే మాట్లాడుకుంటూ అందులో డైలాగ్స్‌ అన్నీ రిహార్సల్‌ చేసేదాన్ని. స్కూల్‌లో కూడా అంతే. నాలో నేను అలా మాట్లాడుకోవడం చూసి.. నాకేదో అయ్యిందేమోనని భయపడి మా తాతయ్య దర్గాకు తీసుకెళ్లి తాయత్తు కట్టించారు కూడా. అది తలచుకుంటే నవ్వొస్తుంది. (Dimple Hayathi Interview)

పరీక్ష పేపర్లు దొంగిలించా..

నేను చిన్నప్పుడు టామ్‌బాయ్‌లా ఉండేదాన్ని. చదువులో తప్ప మిగతా అన్ని విషయాల్లో ముందుండేదాన్ని. స్కూల్‌లో అబ్బాయిలతో గొడవకు దిగడం, కొట్టడం, ప్రిన్సిపాల్‌ గదిలోకి వెళ్లి పరీక్ష పేపర్లు దొంగిలించడం.. ఇలా కొంటె పనులు చాలా చేశాను. పదో తరగతి వచ్చేసరికి నా అల్లరి ఎక్కువైపోవడంతో ప్రిన్సిపాల్‌ ఓసారి మా అమ్మను పిలిపించి.. ‘మీ అమ్మాయిని తీసుకెళ్లిపోయి తనకు ఏం కావాలో అది చేయించండి’ అని చెప్పారు. నాకు సినిమాలపై ఉన్న ఆసక్తిని చూసి.. మా అమ్మ నాతో ఒక ఫొటొషూట్‌ చేయించింది. అది దర్శకుడు సునీల్‌ కుమార్‌ రెడ్డి కంటపడడంతో ‘గల్ఫ్‌’ (Gulf)లో ఆఫర్‌ వచ్చింది.

క్లాసికల్‌ డ్యాన్సర్‌ని

ఖాళీ సమయంలో వర్కవుట్స్‌ చేస్తుంటాను, కొరియన్‌ సినిమాలు ఎక్కువగా చూస్తుంటాను. డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. నేను క్లాసికల్‌ డ్యాన్సర్ని కూడా. సావిత్రి (Savitri), శ్రీదేవి (Sridevi) నటనంటే చాలా ఇష్టం. వారి ముఖకవలికలు, హావభావాలు చూసి.. చిన్నప్పటి నుంచే వారిని అనుకరించేదాన్ని. ఫాంటసీ సినిమాల్లో నటించాలనే కోరిక ఉంది.

ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది..

నిజానికి ‘గద్దలకొండ గణేష్‌’ (Gaddalakonda Ganesh)లో లీడ్‌ క్యారెక్టర్‌ నేనే చేయాల్సింది. కానీ ఆ సమయంలో ఓ పెద్ద డైరెక్టర్‌తో సినిమాకు కమిట్‌ అయ్యాను. కాల్షీట్స్‌ అడ్జస్ట్‌ చేయలేక.. ‘గద్దలకొండ గణేష్‌’ వదులుకోవాల్సి వచ్చింది. నేను ఒప్పుకున్న పెద్ద సినిమా 90 శాతం షూటింగ్‌ పూర్తయ్యాక ఆగిపోయింది. డ్యాన్స్‌ రాదని చెప్పి తప్పించారు. అప్పుడు చాలా బాధపడ్డాను. ఆ సమయంలోనే హరీష్‌ శంకర్‌ (Harish Shankar) ఫోన్‌ చేసి ‘మా సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉంది. అది నువ్వు చేస్తే బాగుంటుంద’ని అన్నారు. ఆ పాట నా జీవితాన్నే మలుపుతిప్పింది. ఆ తర్వాత వరుసగా అలాంటి అవకాశాలే వచ్చాయి కానీ నటిగా నన్ను నేను నిరూపించుకోవాలన్న ఉద్దేశంతో మంచి కథ కోసం ఎదురుచూశా.. ఆ సమయంలోనే ‘ఖిలాడి’ (Khiladi) ఆఫర్‌ వచ్చింది.

Dimple-Hayathi.jpg

గ్లామర్‌ పాత్రలు సెట్‌ అవ్వవన్నారు

ఇంటర్‌ బోర్డు ఎగ్జామ్స్‌ రాస్తున్న సమయంలో ‘గల్ఫ్‌’ సినిమా ఆడిషన్‌ కోసం పిలుపువచ్చింది. అలా ఫస్ట్‌ ఆడిషన్‌లోనే సినిమా ఓకే అయిపోయింది. అప్పుడు నా వయసు పదిహేడేళ్లు. ఆ వయసులో గల్ఫ్‌ వెళ్లడానికి నాకు అనుమతి లేదు. అందుకే డైరెక్టర్‌ నా కోసం రెండు సంవత్సరాలు వెయిట్‌ చేసి, నేను మేజర్‌ అయ్యాక సినిమా స్టార్ట్‌ చేశారు. కుటుంబసభ్యులను వదిలి, పనికోసం అక్కడకు వెళ్లి నానా కష్టాలు అనుభవిస్తున్న భారతీయులను (Indians) చూసి నా మనసు చలించిపోయింది. ఆ సినిమా తర్వాత.. రంగు తక్కువున్నానని, గ్లామర్‌ పాత్రలలో సెట్‌ అవ్వవని చెప్పి కొంతమంది దర్శకులు నన్ను తిరస్కరించారు.

పాట కోసం 6 కిలోలు తగ్గాను

‘ఖిలాడి’లో ‘క్యాచ్‌ మి’ సాంగ్‌ చేయడానికి ముందు లావుగా ఉండేదాన్ని. దాంతో దర్శకుడు ఆ పాట కోసం ఆరు కిలోల బరువు తగ్గమన్నారు. తగ్గాక అనుకోకుండా లాక్‌డౌన్‌ వచ్చింది. దాంతో షూటింగ్‌ వాయిదా పడింది. రెండు నెలల పాటు నా బాడీని మెయిన్‌టైన్‌ చేయడానికి డైట్‌తో పాటు వ్యాయామం చేశాను. చివరకు ఇటలీలో సాంగ్‌ చిత్రీకరణ పూర్తిచేశాం. (Dimple Hayathi About Herself)

ఇవి కూడా చదవండి:

************************************************

*Megastar VS Superstar: చిరంజీవికి పోటీగా రజనీకాంత్.. ఆగస్ట్‌లో అసలు మజా!

*Ramabanam Film Review: అన్నదమ్ముల కథన్నారు, కానీ తీరా చూసాక...

*Bhumika Chawla: హీరోల వయసుపై భూమిక కామెంట్స్.. ఏం మారలేదు

*Takkar: చాలా రోజుల తర్వాత.. ఓన్లీ హీరోయిన్‌పైనే సాంగ్

*The Kerala Story: అది కాదు.. ఇది కదా అసలు స్టోరీ.. ఏఆర్ రెహమాన్ కూడా దండం పెట్టేశారు

Updated Date - 2023-05-07T10:22:02+05:30 IST