పవన్ కళ్యాణ్, విజయ్‌ల విజయ రహస్యం అదే: ఆర్జే బాలాజీ
ABN , Publish Date - May 11 , 2026 | 10:15 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తమిళనాడు నూతన సీఎం విజయ్ పొలిటికల్ సక్సెస్‌పై దర్శకుడు ఆర్జే బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వీరభద్రుడు’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), తమిళనాడు నూతన సీఎం విజయ్ (Vijay)ల పొలిటికల్ సక్సెస్‌పై దర్శకుడు ఆర్జే బాలాజీ (RJ Balaji) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూర్య (Suriya) హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘వీరభద్రుడు’ (VeeraBhadrudu). డ్రీమ్ వారియర్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2026 మే 14న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఆర్జే బాలాజీ సినిమా విశేషాలతో పాటు.. పవన్, విజయ్‌ల సక్సెస్‌కు కారణమేంటో చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ముందుగా తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ గురించి మాట్లాడాలి. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు చాలా మంది నమ్మలేదు, ఎగతాళి చేశారు, ఎన్నో రకాల నెగటివ్ ప్రచారాలు జరిగాయి. కానీ, ఆయన తనపై తనకు ఉన్న నమ్మకాన్ని ఎక్కడా కోల్పోలేదు. తన కల కోసం, లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. దాని ఫలితంగానే ఈరోజు ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. ఎందరో విమర్శించినా, తన నమ్మకాన్ని కోట్ల మంది ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగారు. ప్రజలు కూడా ఆయనను నమ్మి ఓటేశారు. మన మీద మనకి 100 శాతం నమ్మకం ఉంటే, అది ఒక శక్తిగా మారి అందరికీ చేరుతుంది. పవన్, విజయ్‌ల పొలిటికల్ ప్రయాణమే అందుకు నిలువెత్తు నిదర్శనం’’ అని వెల్లడించారు.
చివరిగా తన గురించి మాట్లాడుతూ.. ‘‘నేను ‘వీరభద్రుడు’ సినిమా చేస్తున్నప్పుడు కూడా సూర్య సార్‌ని చాలా మంది ప్రశ్నించారు. మణిరత్నం, సుధా కొంగర, మణిరత్నం వంటి గొప్ప దర్శకులతో పని చేసిన మీరు, ఆర్జే బాలాజీకి అవకాశం ఇవ్వడమేంటని అడిగారు. కానీ ఆయనకు నా మీద నమ్మకం ఉంది, అలాగే నా విజన్ మీద నాకు క్లారిటీ ఉంది. ఎదురుదెబ్బలు తగిలినప్పుడు కుంగిపోకుండా మనల్ని మనం నమ్ముకుంటే కచ్చితంగా విజయం దక్కుతుందని ఆర్జే బాలాజీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
అందుకే తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ చేయడం లేదు- బోయపాటి శ్రీను
Peddi Movie: ‘పెద్ది’ ట్రైలర్‌కు డేట్ ఫిక్సయింది.. బుచ్చిబాబు ప్లాన్ ఇదే!
తన తొలి సినిమా హీరో విజయ్ పై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్!
అవసరమే కానీ.. పెళ్లిపై ఫరియా అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్!