Dimple Hayathi: గుడి కట్టాలనుకుంటున్న అభిమానికి షాకిచ్చిన హయాతి

ABN , First Publish Date - 2023-05-03T17:18:00+05:30 IST

సమంతకు గుడి కట్టినట్లుగా ఇప్పుడు మరో అభిమాని మరో హీరోయిన్‌‌కు గుడి కట్టాలనుకుంటున్నట్లుగా వ్యక్తపరిచాడు. అయితే ఆ అభిమానికి ఆ హీరోయిన్ మాములుగా షాక్ ఇవ్వలేదు.. ఏం చేసిందంటే

Dimple Hayathi: గుడి కట్టాలనుకుంటున్న అభిమానికి షాకిచ్చిన హయాతి
Dimple Hayathi

రీసెంట్‌గా హీరోయిన్ సమంత (Samantha)కు ఆమె అభిమాని తెనాలి సందీప్ (Tenali Sundeep) టెంపుల్ నిర్మించిన విషయం తెలిసిందే. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు గ్రామానికి చెందిన సందీప్.. తను ఎంతగానో ఆరాధించే నటికి గుడి కట్టి.. ఘనంగా ప్రారంభోత్సవం కూడా జరిపాడు. సందీప్ చర్యతో.. ఇప్పటి వరకు కోలీవుడ్‌ (Kollywood)కే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు టాలీవుడ్‌కి కూడా వచ్చేసిందని అనుకుంటున్న సందర్భంలో.. ఇప్పుడు మరో అభిమాని మరో హీరోయిన్‌‌కు గుడి కట్టాలనుకుంటున్నట్లుగా వ్యక్తపరిచాడు. అయితే ఆ అభిమానికి ఆ హీరోయిన్ మాములుగా షాక్ ఇవ్వలేదు. ‘గోల్డెన్’ షాకిచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం.

తెలుగమ్మాయ్ డింపుల్ హయాతి (Dimple Hayathi) ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా నిలదొక్కుకుంటోంది. అంతకు ముందు రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ.. వరుణ్ తేజ్ ‘గద్దల కొండ గణేష్’ (Gaddalakonda Ganesh) మూవీలో చేసిన ఐటమ్ సాంగ్‌తో డింపుల్ ఫేమస్ అయింది. ఆ తర్వాత ఆమెకు మాస్ మహారాజా రవితేజ ‘ఖిలాడి’ (Khiladi) సినిమాలో అవకాశం వరించింది. ఆ మూవీ అనుకున్నంతగా సక్సెస్ కానప్పటికీ.. అందులో డింపుల్ ఆరబోసిన అందాలు మాత్రం హాట్ టాపిక్ అయ్యాయి. తెలుగమ్మాయి ఈ స్థాయిలో గ్లామర్ ప్రదర్శన చేయడంతో.. ఆమె ఒక్కసారిగా అందరి దృష్టిలో పడింది. ఇప్పుడు గోపీచంద్ (Gopichand) హీరోగా శ్రీవాస్ (Sriwass) దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామబాణం’ (Rama Banam) చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం మే 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఓ అభిమాని ఆమెకు ‘మీకు గుడి కట్టాలని అనుకుంటున్నాను’ అని డైరెక్ట్‌గా అడిగేశాడు.

Dimple.jpg

‘మీకు గుడి కట్టాలని అనుకుంటున్నాను. పాలరాతితో కట్టాలా.. ఇటుకలతోనా అని ఆలోచిస్తున్నాను’ అని డింపుల్‌ని అభిమాని ప్రశ్నించాడు. దీనికి ఆమె ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాని షేక్ చేయడమే కాదు.. ఇప్పుడంతా ఆమె గురించి మాట్లాడుకునేలా చేస్తోంది. ‘పాలరాతితో వద్దు.. ఇటుకలతో వద్దు.. బంగారం (Gold)తో కట్టినప్పుడు నాకు చెప్పండి’ అని ఫన్నీగా జవాబిచ్చింది. దీంతో అక్కడున్నవారంతా.. ఈ అమ్మాయి సామాన్యమైనది కాదు అంటూ.. నవ్వేశారు. ఇదే వేదికగా.. ట్రోల్స్‌(Trolls)పై కూడా ఆమె స్పందించారు. ‘‘నాకు కొత్తలో ఈ ట్రోల్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసేది కాదు.. ఇప్పుడు వాటిని అసలు పట్టించుకోవడం లేదు. ఒక పరిధి దాటనంత వరకు ట్రోల్స్ బాగానే ఉంటాయి. కానీ అవి హద్దులు దాటితేనే సీరియస్‌గా యాక్షన్ ఉంటుంది. ఎంత సెలబ్రిటీలం అయితే మాత్రం.. మేము కూడా మనుషులమే అని గుర్తుపెట్టుకోవాలి కదా..’’ అని డింపుల్ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి:

************************************************

*Chaitu Vs Sam: చైతూ ఏమో బాధలేదంటాడు.. సమంత ఏమో టార్చర్ టైమ్ అంటోంది.. ఏంటి కథ?

*Hero Shanthanu Bhagyaraj: ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..

*VD12: విజయ్ దేవరకొండ 12వ చిత్రం ప్రారంభం.. చిత్ర విశేషాలివే!

*Parineeti Chopra: ఆప్ ఎంపీతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం.. ఎప్పుడంటే?

*Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం

*Actress Shalini: నా విడాకులు వారికి అంకితం.. డివోర్స్ ఫొటోషూట్‌తో నటి హల్చల్

Updated Date - 2023-05-03T17:26:25+05:30 IST