ఇమ్ము, శ్రీ సత్యల ‘డెస్టినీ’కి అనిల్ రావిపూడి సపోర్ట్.. ఏం చేశారంటే?

ABN , Publish Date - Oct 28 , 2026 | 11:09 PM

కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ పతాకంపై దినేష్ కుర్ర నిర్మిస్తున్న వినూత్న చిత్రం ‘డెస్టినీ’. చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జబర్దస్త్ ఫేమ్ ఇమాన్యుయేల్ హీరోగా నటిస్తుండగా, బిగ్‌బాస్ బ్యూటీ శ్రీ సత్య హీరోయిన్‌గా అలరించనున్నారు.

Destiny Movie Song Launch

కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ పతాకంపై దినేష్ కుర్ర నిర్మిస్తున్న వినూత్న చిత్రం ‘డెస్టినీ’ (Destiny). చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జబర్దస్త్ ఫేమ్ ఇమాన్యుయేల్ (Emmanuel) హీరోగా నటిస్తుండగా, బిగ్‌బాస్ బ్యూటీ శ్రీ సత్య (Sri Satya) హీరోయిన్‌గా అలరించనున్నారు. అలాగే సీనియర్ నటి ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి చేతుల మీదుగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన రాబట్టుకోగా, తాజాగా ఈ సినిమా నుంచి ‘ఇద్దరి గుండెలపైన’ (Iddari Gundela Paina) అంటూ సాగే యూత్‌ఫుల్ మెలోడీ లవ్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.


ఈ అందమైన ప్రేమ గీతాన్ని టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi).. తన చేతుల మీదుగా విడుదల చేసి చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘పాట చాలా శ్రావ్యంగా, ఫ్రెష్‌గా ఉంది. దర్శకుడు చెప్పిన సినిమా కాన్సెప్ట్ కూడా విన్నాను, చాలా ఆసక్తికరంగా ఉంది. ఇమాన్యుయేల్ నాకు వ్యక్తిగతంగా ఎంతో సన్నిహితుడు. హీరోగా చేస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించి, యూనిట్ అందరికీ గొప్ప పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


సంగీత దర్శకుడు మారుతి రాజా యూత్‌ను కట్టిపడేసేలా క్యాచీ బాణీలతో ఈ పాటను స్వరపరిచారు. శ్రీరామ్ తపస్వి అందించిన సాహిత్యం మనసుకు హత్తుకునేలా ఉండగా, సాయి చరణ్ భాస్కరుణి, అభిఖ్య తణికెళ్ల తమ మధురమైన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. చంద్రకిరణ్ మాస్టర్ కొరియోగ్రఫీలో వచ్చిన సింపుల్ అండ్ గ్రేస్‌ఫుల్ స్టెప్స్ సోషల్ మీడియాలో రీల్స్ చేయడానికి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేలా ఉన్నాయి. పంకజ్ తొట్టాడ సినిమాటోగ్రఫీ, డి. వెంకట ప్రభు ఎడిటింగ్‌తో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే మరిన్ని ఆసక్తికర అప్‌డేట్లతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి:

టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సీనియర్ నిర్మాత కన్నుమూత

‘ఆదర్శకుటుంబం’లో టెన్షన్.. అసలు విషయం ఏంటంటే

‘కిల్లర్’ సినిమా ట్విస్ట్ చెబితే రూ. కోటి.. కాంటెస్ట్ రూల్స్ ఇవే

Updated Date - Oct 28 , 2026 | 11:09 PM

జబర్దస్త్ ఇమాన్యుయేల్ హీరోగా.. సినిమా టైటిల్ ఇదే

సయామీ ఖేర్ ఇంటర్నేషనల్ ఎంట్రీ.. ఇండో-రష్యన్ ప్రాజెక్ట్‌లో క్రేజీ రోల్

‘దొంగ నా కొడుకు’ నుంచి ‘ఓ మై గాడ్’ పాటొచ్చింది

రజనీతో రజనీకే పోటీ.. టాప్‌-3లో ఒకడే కింగ్‌

సూర్యకు ఈ ఏడాది త్రిపుల్‌ ధమాకా.. అదే జరిగితే హిస్టరీనే