సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'కామ్రేడ్‌ కళ్యాణ్‌' ట్రైలర్ పై బాలయ్య ఫ్యాన్స్ కినుక!

ABN, Publish Date - Oct 07 , 2026 | 11:55 AM

కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ లో రాధిక చెప్పిన బాలయ్య సినిమాల డైలాగ్ పై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Comrade Kalyan Movie

శ్రీవిష్ణు తాజా చిత్రం 'కామ్రేడ్‌ కళ్యాణ్‌'. వినోద ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా ఇదే నెల 9న జనం ముందుకు రాబోతోంది. తాజాగా మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్‌ ను విడుదల చేశారు. ఈ సినిమాలో హీరో తల్లి పాత్ర పోషించిన రాధిక బాలకృష్ణకు వీరాభిమాని. బాలకృష్ణ సినిమా రిలీజ్‌ అయితే చాలు థియేటర్ బయట తోటి అభిమానులతో కలిసి జై బాలయ్య అంటూ హంగామా చేస్తుంటుంది. 'కామ్రేడ్‌ కళ్యాణ్‌' లోని రాధిక పాత్ర గురించి మేకర్స్ కొద్దిరోజుల క్రితం రివీల్‌ చేయగానే బాలకృష్ణ అభిమానులు తెగ ఆనంద పడ్డారు. ఎందుకంటే బాలకృష్ణ అంటే నిజ జీవితంలో కూడా రాధికకు ఎంతో అభిమానం. వారిద్దరి మధ్య స్పెషల్ బాండింగ్‌ ఉంది. అయితే లేటెస్ట్ గా విడుదలైన 'కామ్రేడ్‌ కళ్యాణ్‌' ట్రైలర్ లో రాధికతో చెప్పించిన డైలాగ్స్ మాత్రం బాలయ్య అభిమానులకు కాస్తంత అసహనాన్ని కలిగించాయి. దాంతో 'కామ్రేడ్‌ కళ్యాణ్‌' మూవీని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

ఇంతకూ విషయం ఏమిటంటే... ఈ ట్రైలర్ లో రాధిక 'టాప్ హీరో' మూవీ రిలీజైనప్పుడు థియేటర్ దగ్గర హడావుడి చేస్తుంటుంది. 'బాలయ్య బాబు బొమ్మ సూపర్ హిట్‌' అని అనగానే, పక్కన ఒకడు 'సినిమా ఏవరేజ్‌ అంట కదా' అంటాడు. దాంతో కోపంగా సీసాతో వాడి తల పగలగొడుతుంది. కట్ చేస్తే పోలీస్‌ స్టేషన్‌లో ఎస్.ఐ. బ్రహ్మాజీ 'ఎటమ్ట్ మర్డర్ కేసు... ఏడేళ్ళు జైల్లో ఉండాల్సిందే' అని బెదిరిస్తాడు. వెంటనే రాధిక ఆందోళనగా 'మూడు నెలల్లో 'బొబ్బిలి సింహం'... ఆ తర్వాత 'భైరవద్వీపం' అవన్నీ నేను చూడలేను కద సార్‌' అంటుంది. ఇదిగో ఈ డైలాగే బాలయ్య బాబు అభిమానులను అసహనానికి గురిచేసింది.


ఎందుకంటే... బాలయ్య బాబు అభిమానులకు ఈ సినిమాలు వేటి తర్వాత ఏవి విడుదల అయ్యాయనేది తెలుసు. కానీ ఈ ట్రైలర్‌లో వాటిని పూర్తిగా తారుమారు చేసి చూపించారు. 'టాప్‌ హీరో' సినిమా డిసెంబర్ 9, 1994లో విడుదలైంది. దానికంటే ముందే అదే యేడాది 'భైరవ ద్వీపం, బొబ్బిలి సింహం' సినిమాలు వచ్చాయి. ఘన విజయం సాధించాయి. మరి 'టాప్‌ హీరో' సినిమా తర్వాత ఆ రెండు సినిమాలు రాబోతున్నాయని రాధికతో దర్శకుడు ఎలా చెప్పించాడో అర్థం కావడం లేదంటున్నారు బాలయ్య అభిమానులు. ఏదో ఒక క్యారెక్టర్ తో మామూలుగా చెప్పిస్తే పెద్దంత పట్టించుకునే వాళ్లం కాదని... కానీ ఇందులో రాధికను బాలయ్య బాబు వీరాభిమానిగా చూపించి, ఇలా సినిమాలను అటూ ఇటూ ఎలా చేసేస్తారని వాపోతున్నారు. వాస్తవానికి 'టాప్‌ హీరో' తర్వాత వచ్చిన సినిమా 'మాతో పెట్టుకోకు, వంశానికొక్కడు'. అయితే వాటి విడుదల చాలా గ్యాప్ తర్వాత జరిగింది. తమకు అనుకూలంగా ఇలా డైలాగ్స్ రాసేసుకుని, ఇష్టం వచ్చినట్టు రాధిక పాత్రతో చెప్పించడం సబబుగా లేదని వారు అంటున్నారు.


ఇదిలా ఉంటే... ఈ సినిమా మేకర్స్ కు బాలకృష్ణతో మంచి అనుబంధం ఉందని, వీరంతా ఆయన అభిమానులే నని కొందరంటున్నారు. ఇలాంటివి చేయడం వల్ల సినిమాకు ట్రోలింగ్‌ రూపంలో ఫ్రీ పబ్లిసిటీ వస్తుందనే ఉద్దేశ్యంతో కావాలనే ఇలా చేశారని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

అభిమాని హ‌త్య కేసు.. దర్శన్‌కు మరో బిగ్ షాక్

ధనుష్ కొత్త పార్టీ.. 'తమిళగ ఎళుచ్చి కళగం'? ఈసీ వద్ద నమోదు!

నిన్న రాజశేఖ‌ర్.. నేడు విజ‌య శాంతి! అస‌లు బాల‌య్య‌తో.. ఏం ఫ్లాన్ చేస్తున్నావ్ శివ‌య్య

Updated Date - Oct 07 , 2026 | 12:43 PM