ధనుష్ కొత్త పార్టీ.. 'తమిళగ ఎళుచ్చి కళగం'? ఈసీ వద్ద నమోదు!
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:49 AM
ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే జరిగింది. ప్రముఖ తమిళ హీరో ధనుష్ (Dhanush) రాజకీయ అరంగేట్రానికి వేగంగా అడుగులు పడుతున్నాయి.
ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే జరిగింది. ప్రముఖ తమిళ హీరో ధనుష్ (Dhanush) రాజకీయ అరంగేట్రానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆయన 'తమిళగ ఎళుచ్చి కళగం (తమిళనాడు పురోగ మన పార్టీ) (Tamizhaga Ezhuchchi Kazhagam) పేరుతో కొత్త పార్టీని ప్రారంభిం చనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఆయన తన పార్టీ పేరును ఎన్నికల సంఘం వద్ద నమోదు చేయించినట్లు సమాచారం.
ఇటీవల జరిగిన తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సినీ నటుడు విజయ్ నేతృ త్వంలోని టీవీకే ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఐదు దశాబ్ధా లకు పైగా చరిత్ర ఉన్న, పలుమార్లు రాష్ట్రాన్ని ఏలిన డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీలు పరాజయం పాలై.. ప్రతిపక్షంలో కూర్చున్నాయి.
ఈ నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మాజీ అల్లుడు కూడా అయిన ధనుష్ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గత కొంతకాలంగా సన్నాహాలు చేసుకుంటున్నారు. తన అభిమాన సంఘాలు రూపొందించుకున్న ప్రత్యేక పతాకాన్ని కూడా ఇటీవల ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన 'తమిళగ ఎళుచ్చి కళగం' పేరుతో పార్టీని రిజిస్టర్ చేయించినట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై ధనుష్ అధికారిక ప్రకటన చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.