Attahaasam: యో.. పుష్పగాడి అన్న కూతురు హీరోయిన్ అయ్యిందిరో

ABN , Publish Date - Oct 06 , 2026 | 07:27 PM

కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి క్లాసిక్ చిత్రాలతో టాలీవుడ్‌‌లో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన ప్రతిభావంతుడైన దర్శకుడు వెంకటేష్ మహా (Venkatesh Maha).

Attahaasam

కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి క్లాసిక్ చిత్రాలతో టాలీవుడ్‌‌లో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన ప్రతిభావంతుడైన దర్శకుడు వెంకటేష్ మహా (Venkatesh Maha). నేచురలిస్టిక్ కథలతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఆయన ఈ ఏడాది రావు బహదూర్ సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చాడు. ఈ సినిమా కథ బావున్నా.. కన్ఫ్యూజ్ ఎక్కువ ఉండడంతో మిక్స్డ్ టాక్ ని అందుకుంది.


ఇక మొదటి నుంచి వెంకటేష్ మహా నటుడిగా కూడా రాణిస్తూ వస్తున్నాడు. ఎట్టకేలకు ఈ డైరెక్టర్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. వెంకటేష్ మహా నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం అట్టహాసం. ఈ సినిమాలో కార్తీక్ రత్నం మరో హీరోగా నటిస్తోండగా.. యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన స్రవంతి పేపకాయల, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ని చిన్నాయన అంటూ పిలిచి గుర్తింపు తెచ్చుకున్న పావని కరణం హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు మహాయాన బ్యానర్స్‌పై చింతా వరలక్ష్మి సమర్పణలో, చింతా గోపాలకృష్ణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి చింతా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చింతా వినీషా రెడ్డి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.


తాజాగా అట్టహాసం కు సంబంధించిన కలర్‌ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ పరిశీలిస్తే రెండు భిన్నమైన మూడ్‌‌లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పైన ఒక రకమైన మోడర్న్ అండ్ రస్టిక్ వైబ్‌తో కార్తీక్ రత్నం, పావని జంట కనిపించగా, కింద విభాగంలో కానిస్టేబుల్ క్యాప్‌తో, కర్ర పట్టుకుని వెంకటేష్ మహా, సాంప్రదాయ వస్త్రధారణలో ఉన్న స్రవంతి నవ్వుతూ కనిపించారు. పైన జంట మాకు మోక్షం కావాలని ఆడగుతుండగా.. కింద మాకు ఉద్యోగం కావాలని అడుగుతున్నట్లు చూపించారు. అంటే నిరుద్యోగం, మోక్షం, సమాజంలోని విభిన్న కోణాలను తనదైన శైలిలో వినోదాత్మకంగా వెంకటేష్ మహా ఎలా చూపించబోతున్నారనేది పోస్టర్‌‌తోనే భారీ అంచనాలను పెంచేసింది. వచ్చే వేసవికి ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ఈ సినిమాతో వెంకటేష్ మహా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

ఇవి కూడా చదవండి:

The Traitors Telugu: బిగ్ బాస్ కన్నా వీళ్లే బావున్నారుగా

Jailer 2: వర్మ లేని లోటు తెలుస్తుందే..

చరణ్ - సుకుమార్ మూవీ మైథాలజీ కథతోనా..?

Updated Date - Oct 06 , 2026 | 07:27 PM