పెళ్లి తరువాత నయన్ బికినీ లుక్.. ఇలా మోసం చేస్తుందనుకోలేదే
ABN , Publish Date - Oct 06 , 2026 | 07:50 PM
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడంటే అన్నీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఎంతో ట్రెడిషనల్ గా కనిపిస్తుంది కానీ, అప్పట్లో నయన్ తన అందాలతో థియేటర్లను ఊపేసిన విషయం చెప్పనక్కర్లేదు.
లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడంటే అన్నీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఎంతో ట్రెడిషనల్ గా కనిపిస్తుంది కానీ, అప్పట్లో నయన్ తన అందాలతో థియేటర్లను ఊపేసిన విషయం చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తమిళ్ బిల్లా సినిమాలో నయన్ బికినీ అవతార్ ని మరచిపోవడం ఏ ఫ్యాన్ వలన కాదు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఆ సినిమా తరువాత ఇన్నాళ్లకు నయన్ బికినీలో కనిపించి సోషల్ మీడియాని షేక్ చేసింది.
తాజాగా మాల్దీవ్ లో నయన్ రచ్చ చేసింది. వైట్ బికినీ టాప్, ఎరుపు రంగు బోల్డ్ ప్రింట్స్ ఉన్న షీర్ సరోంగ్ ధరించి నయన్ ఇచ్చిన బీచ్ పోజులు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. అయితే ఇక్కడే నయన్ షాక్ ఇచ్చింది. ఈ బికినీ ఫోటోలను ఆమె డ్రీమీ, మోషన్-బ్లర్ లో పోస్ట్ చేసింది. నయన్ ఫేస్ పూర్తిగా కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఏంటి నయన్ ఇంత మోసం చేశావ్.. బ్లర్ లేకుండా పెట్టొచ్చుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు పెళ్లై, దర్శకుడు విగ్నేష్ శివన్‌తో ఇద్దరు పిల్లలు ఉన్న నయనతార ఇలా ఈత దుస్తుల్లో కనిపించడమే అత్యంత అరుదు .. ఇలా అయినా చూసి ఆనందిస్తాము అంటూ చెప్పుకొస్తున్నారు.
ఇక మరికొందరు ఫ్యాన్స్ ఈ ఫొటోలను AI టెక్నాలజీతో మరింత క్వాలిటీగా ఎడిట్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం నయన్ మూకుత్తి అమ్మన్ 2 వంటి వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో ఎంతో బిజీగా ఉంది. సాధారణ బ్లర్ ఫొటోలే అనుకున్న వారికి, ఇది ఒక ఆర్టిస్టిక్ వైబ్ అని స్పష్టమవ్వడంతో నెటిజన్ల నెగెటివిటీకి చెక్ పడింది. 40 ఏళ్ళు దాటినా తన గ్లామర్ అస్సలు తగ్గలేదని నయనతార మరోసారి నిరూపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
Also Read:
Attahaasam: యో.. పుష్పగాడి అన్న కూతురు హీరోయిన్ అయ్యిందిరో
అరేయ్ ఏం బిగ్ బాస్ రా బాబు.. చిరాకొచ్చేస్తుంది
The Traitors Telugu: బిగ్ బాస్ కన్నా వీళ్లే బావున్నారుగా