‘భోగి’లో అనుపమ పరమేశ్వరన్.. ఫస్ట్ లుక్ మాములుగా లేదుగా!
ABN, Publish Date - Apr 30 , 2026 | 02:48 PM
చార్మింగ్ స్టార్ శర్వానంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న భారీ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ చిత్రం ‘భోగి’. ఈ సినిమా నుంచి అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్‌ని మేకర్స్ వదిలారు.
చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand), సంపత్ నంది (Sampath Nandi) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న భారీ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ చిత్రం ‘భోగి’ (Bhogi). శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. శర్వానంద్ కెరీర్‌లో అత్యంత భారీ స్థాయి ప్రాజెక్టులలో ఒకటిగా రూపుదిద్దుకుంటోన్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఫస్ట్-లుక్ పోస్టర్, శర్వా పుట్టినరోజు ప్రత్యేక పోస్టర్‌ను ఆసక్తిని పెంచాయి.తాజాగా మేకర్స్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) పాత్రను పరిచయం చేస్తూ, ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.
ఇందులో అనుపమ.. ‘కందుల సులోచన రాణి’ (Kandula Sulochana Rani) పాత్రలో కనిపించనుందని తెలుపుతూ మేకర్స్ వదిలిన పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. పల్లెటూరి యువతిగా అనుపమ సహజసిద్ధమైన లుక్‌లో కనిపిస్తోంది. దుమ్ముతో నిండిన గ్రామీణ మార్గంలో నడుస్తూ, తలపై ఆకులతో నిండిన పెద్ద బుట్టను మోస్తూ, చేతిలో మరికొన్ని ఆకులు, టిఫిన్ డబ్బాతో కనిపించడంతో అంతా ఫిదా అవుతున్నారు. హాఫ్ శారీ, ఫేడెడ్ బ్లౌజ్‌తో ఆమె లుక్ పూర్తిగా రస్టిక్ ఫీల్‌ను ఇస్తోంది. అలాగే ఆమె లుక్‌లో ఉన్న ఇంటన్సిటీ ఈ సినిమాలో ఆమె పాత్రకున్న బలాన్ని సూచిస్తోంది. బ్యాక్‌డ్రాప్‌లో కనిపించే మట్టి ఇళ్లు, కంచెలు, పశువులు.. ఇవన్నీ చూస్తుంటే అసలైన గ్రామీణ వాతావరణాన్ని మరింత అందంగా చూపిస్తున్నాయి.
మోదుగ ఆకులతో ఆకుపళ్లెం తయారు చేస్తూ జీవనం సాగించే సులోచన పాత్రలో అనుపమ ఇందులో కనిపించనున్నారని తెలుస్తోంది. గంగా అనే తుఫాన్‌లాంటి పాత్రకు ఆత్మలా నిలిచే సులోచన ఈ కథలో కీలక పాత్రగా ఉండనుందని, ఈ పాత్ర కోసం అనుపమ డైలెక్ట్, డిక్షన్, ఎమోషనల్ న్యూయాన్స్‌లను ఎంతో కచ్చితంగా ప్రాక్టీస్ చేసి, నిజమైన అనుభూతిని తీసుకొచ్చిందని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటికే రాజమహేంద్రవరం, రంపచోడవరం, మారేడుమిల్లి అడవుల్లో హై-ఇంటెన్సిటీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించుకున్న ఈ చిత్రం.. త్వరలో హైదరాబాద్ పరిసరాల్లో నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభించుకోనుంది. డింపుల్ హయాతి మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా.. 1960ల నేపథ్యంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో సాగే యాక్షన్, భావోద్వేగాలతో నిండిన పీరియడ్ డ్రామాగా రూపొందుతోంది. రక్షా బంధన్ స్పెషల్‌గా ఆగస్ట్ 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
కయాదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా?
మంగ్లీపై అసత్య ప్రచారం.. అసభ్యకర పోస్టులు చేస్తున్నారు
Theater Movies: ఈ వారం.. థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు
చందమామకు సెకండ్ ఇన్నింగ్స్.. సెట్ అవుతుందా