Sharwanand - Srinu Vaitla: శర్వాకు జోడీగా మల్లూబ్యూటీ..
ABN , Publish Date - Nov 30 , 2025 | 10:06 AM
శర్వానంద్, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే! ఈ సినిమాలో ‘మ్యాడ్’, ‘8 వసంతాల’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ‘
శర్వానంద్ (Sharwanand), శ్రీనువైట్ల (Srinu Vaitla) కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే! ఈ సినిమాలో ‘మ్యాడ్’, ‘8 వసంతాల’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్‌ను (Anantika Sanil kumar) హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ‘8 వసంతాలు’ చిత్రంతో యూత్‌ను బాగా ఆకట్టుకుందీ మలయాళ బ్యూటీ. ఇప్పుడు శర్వాతో జోడీ కట్టడానికి సిద్ధమైందని తెలిసింది. ఇప్పటికే మేకర్స్ ఆమెతో చర్చలు జరిపారని కథ ఆమెకు నచ్చడంతో ఓకే చెప్పిందని తెలిసింది.

శ్రీను వైట్ల గత చిత్రం ‘విశ్వం’ ఏవరేజ్‌గా ఆడింది. దీంతో ఎలాగైనా హిట్ సినిమా తీయాలనే కసి మీదున్నారు శ్రీను వైట్ల. ఈ మేరకు కథ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారట. తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఓ పని కారణంగా హీరో లైఫ్‌లొ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్న ఇతివృత్తంతో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో వీరిద్దరి కలయికలో సినిమా మొదలవుతుందని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుందని, అ మరో సీనియర్ హీరో కూడా ఈ చిత్రంలో కనిపిస్తారని టాక్.