సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మెగాస్టార్ ఇంట్లో బెల్లంకొండ ఫ్యామిలీ.. విషయమిదే!

ABN, Publish Date - Apr 22 , 2026 | 04:28 PM

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో బెల్లంకొండ ఫ్యామిలీ ప్రత్యక్షమయ్యారు. బెల్లంకొండ సురేష్ దంపతులు, కాబోయే నూతన దంపతులైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యరెడ్డి.. చిరంజీవి ఇంటికి ప్రత్యేకంగా రావడం విశిష్టతను సంతరించుకుంది.

Bellamkonda Family Meets Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఇంట్లో బెల్లంకొండ ఫ్యామిలీ (Bellamkonda Family) ప్రత్యక్షమయ్యారు. బెల్లంకొండ సురేష్ దంపతులు, కాబోయే నూతన దంపతులైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), కావ్యరెడ్డి (Kavya Reddy).. చిరంజీవి ఇంటికి ప్రత్యేకంగా రావడం విశిష్టతను సంతరించుకుంది. ఇంతకీ వారు ఎందుకు వచ్చారో.. అర్థమయ్యే ఉంటుంది కదా! అవును, మెగాస్టార్ చిరంజీవి అండ్ ఫ్యామిలీని పెళ్లికి ఆహ్వానించేందుకే.. వీరంతా ప్రత్యేకంగా ఆయన ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్‌లను కూడా ప్రత్యేకంగా కలిసి, వివాహానికి రావాలని బెల్లంకొండ ఫ్యామిలీ ఆహ్వానించిన విషయం తెలిసిందే.


ఇప్పుడు చిరంజీవిని ఆహ్వానించేందుకు కాబోయే భార్యతో సహా కలిసి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రావడంతో, ఆ జంటను చూసి చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. మనస్ఫూర్తిగా ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవికి బెల్లంకొండ ఫ్యామిలీ ఇచ్చిన వివాహ పత్రిక కూడా చాలా వైవిధ్యంగా ఉండటం విశేషం. ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ శంకర్‌పల్లిలోని ఓ విశాలమైన ఫామ్‌హౌస్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల వివాహ వేడుక ఏప్రిల్ 29న పుణ్యక్షేత్రమైన తిరుమలలో జరగనుంది. ఈ పెళ్లికి ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తోన్న బెల్లంకొండ ఫ్యామిలీ, ఆ వెంటనే హైదరాబాద్‌లో జరిగే రిసెప్షన్‌‌కు అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఈ రిసెప్షన్‌ను గ్రాండ్‌గా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి జంట కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. వారి ప్రేమ, పెద్దల అంగీకారంతో పెళ్లి వరకు చేరుకుంది.

ఇవి కూడా చదవండి:

చిరంజీవి ఇంటికి సమీపంలోనే అల్లు అర్జున్ లగ్జరీ హౌస్.. ఎన్ని కోట్లంటే?

అలా విమర్శించే వారిని వదలకండి: చంద్రబాబుకు బండ్ల సూచన

సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చిన సెలబ్రిటీలు వీరే!

Updated Date - Apr 22 , 2026 | 04:41 PM