Bellamkonda Sai Srinivas: బెల్లంకొండ హీరో.. ఈ ఏడాది ఫుల్ బిజీ
ABN , Publish Date - Jan 03 , 2026 | 09:04 PM
కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) గత కొద్దీ కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే.
Bellamkonda Sai Srinivas: కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) గత కొద్దీ కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. గతేడాది భైరవం సినిమాతో వచ్చాడు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇక ఈ ఏడాది ఒకటి కాదు.. రెండు కాదు మూడు సినిమాలతో వస్తున్నాడు. నేడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు కావడంతో తమ హీరోకి మేకర్స్ బర్త్ డే విషెస్ తెలుపుతూ కొత్త పోస్టర్స్ ని రిలీజ్ చేశారు.
ప్రస్తుతం బెల్లంకొండ నటిస్తున్న మూడు చిత్రాలు.. టైసన్ నాయుడు, రామం, హైందవ. ఈ మూడు సినిమాలు షూటింగ్ ని జరుపుకుంటున్నాయి. టైసన్ నాయుడు చిత్రాన్ని రెండేళ్ల క్రితమే శ్రీనివాస్ ప్రకటించాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మధ్యలో ఈ సినిమా అడ్రెస్ లేకపోయేసరికి ఆగిపోయిందేమో అనుకున్నారు. కానీ, ఎట్టకేలకు ఈ ఏడాదిలో టైసన్ నాయుడుకు మోక్షం దొరకనున్నట్లు తెలుస్తోంది.
ఇక టైసన్ నాయుడు కాకుండా శ్రీనివాస్ నుంచి వస్తున్న మరో చిత్రం హైందవ. లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ చందు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ రెండు సినిమాలతో పాటు ఈ ఏడాది బెల్లంకొండ హీరో మరో కొత్త సినిమాను ప్రకటించాడు... అదే రామం. అకీరా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేణు దోనేపూడి నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ మూడు సినిమాలతో ఈ కుర్ర హీరో విజయాలను అందుకుంటాడా.. ? లేదా అనేది చూడాలి.