Bellamkonda Sreenivas: బెల్లంకొండ పదో సినిమా హీరోయిన్ ఎవరంటే!

ABN , Publish Date - May 02 , 2024 | 03:35 PM

'అల్లుడు శ్రీను' చిత్రంతో హీరోగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్‌. పదేళ్ల కెరీర్‌లో ఆయన తొమ్మిది చిత్రాలు చేశారు. ప్రస్తుతం పదో సినిమా సన్నాహాల్లో ఉన్నారు. ఆయన హీరోగా మూన్‌ షైన్‌ పిక్చర్స్‌ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది.

Bellamkonda Sreenivas: బెల్లంకొండ పదో సినిమా హీరోయిన్ ఎవరంటే!

'అల్లుడు శ్రీను' (Alludu Sreenu) చిత్రంతో హీరోగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్‌ (Bellamkonda Sreenivas) . పదేళ్ల కెరీర్‌లో ఆయన తొమ్మిది చిత్రాలు చేశారు. ప్రస్తుతం పదో సినిమా సన్నాహాల్లో ఉన్నారు. ఆయన హీరోగా మూన్‌ షైన్‌ పిక్చర్స్‌ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. సుధీర్‌ బైరెడ్డి (Sudheer Byreddy)ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. తాజాగా ఈ సినిమా హీరోయిన్  గురించి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్‌ (Samyukta Menon) ఈ చిత్రంలో హీరోయిన్ గా  ఎంపిక చేసుకున్నారని సమాచారం. రూ.50 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్లాన్  చేశారు. బెల్లంకొండ శ్రీనుకి బాగా నచ్చిన కథ ఇది. ఏడాదిగా ఈ కథపై ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్‌లో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.

Samyuktha.jpg

సైన్స్‌ ఫిక్షన్‌, సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌ ఇది. ఈ  జానర్‌కు పాన ఇండియా స్థాయిలో ఆదరణ ఉంటుందనే నమ్మకంతో నిర్మాతలు రూ. 50 కోట్టు బడ్జెట్‌ పెట్టడానికి సిద్ధపడ్డారు. ప్రస్తుతం నటీనటులు, ఇతర టెక్నీషియన్ల ఎంపిక జరుగుతోంది. ఎవరూ ఊహించని కొన్ని కాంబినేషన్స్  ఈ సినిమాతో తెరపై కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

Jr NTR: ఎన్టీఆర్‌- ప్రశాంత్ నీల్ లేటెస్ట్‌ అప్‌డేట్‌!

Read More: Tollywood, Cinema News

Updated Date - May 02 , 2024 | 03:48 PM